TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

'గేమ్ ఛేంజర్' టీజర్.. మెగా సందడి షురూ!

Oct 25, 2024 11:38AM

మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూసున్న రోజు రాబోతుంది. 'గేమ్ ఛేంజర్' టీజర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా ఈ మూవీ టీజర్ విడుదల కానుందని సమాచారం. (Game Changer Teaser)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'గేమ్ ఛేంజర్'. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రెండు పాటలు, కొన్ని పోస్టర్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో అసలు 'గేమ్ ఛేంజర్' ఎలా ఉండబోతుందో తెలుసుకున్న క్యూరియాసిటీతో ఈ మూవీ టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. దీపావళి కానుకగా అక్టోబర్ 31న 'గేమ్ ఛేంజర్' టీజర్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. 

'గేమ్ ఛేంజర్' చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

google-ad-img