హీరోగా రానున్న జివి
on Oct 7, 2013
జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడిగా అందరికి సుపరిచితుడే. అయితే జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా "పెన్సిల్" అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని జి.వి.ప్రకాష్ కుమార్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా మణి నాగరాజ్ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో జి.వి. సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది.