Home

»

Latest News

'ఫౌజీ' గ్లింప్స్‌ రిలీజ్: పాన్ ఇండియా రెస్పాన్స్ ఇదే!

Oct 24, 2026 10:30AM


పాన్ ఇండియా కింగ్ 'ప్రభాస్' పుట్టిన రోజుని నిన్న అభిమానులు చాలా ఘనంగా జరుపుకున్నారు. కానీ వాళ్ళందరిలో ఏ నిమిషమైనా 'ఫౌజీ'' గ్లింప్స్‌ రిలీజ్ కాకపోతుందా అనే కుతూహలం.. అందుకు తగ్గట్టే మేకర్స్ నిన్న నైట్ 10 తర్వాత రిలీజ్ చేసారు. అలా రిలీజ్ చేసారో లేదో రికార్డుల ఊచకోతకి పేరు మార్చాల్సిన పరిస్థితి. 

‘ఫౌజీ’ పవర్‌ఫుల్ హిస్టారికల్ ఫైల్ నంబర్ 25  పేరుతో రిలీజైన గ్లింప్స్‌  రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో  1942 మే 29న బెర్లిన్‌లో ప్రారంభమవుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే చారిత్రాత్మక సమావేశాన్ని ఇందులో చూపించారు. భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి జర్మనీ మద్దతుని కోరుతారు నేతాజీ. దాదాపు రెండు శతాబ్దాల అణచివేత తర్వాత భారత్‌కు స్వాతంత్ర్యం సాధ్యమేనా అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ మొదలవుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారత్ ఓడించగలదా అని హిట్లర్ ప్రశ్నించగా, స్వాతంత్రం సాధించాలనే సంకల్పాన్ని ఎవరూ ఆర్పలేరని నేతాజీ గట్టిగా చెబుతారు.

సైనిక బలానికంటే ఇంటెలిజెన్స్ మరింత శక్తివంతంగా పనిచేయగలదని నేతాజీ చెప్పడంతో సంభాషణ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. తన వాదనకు బలాన్ని చేకూర్చేందుకు బ్రిటిష్ ఇంటెలిజెన్స్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఓ అసాధారణ భారతీయ ఆపరేటివ్ కథను ఆయన పరిచయం చేస్తారు. అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించిన ఆపరేషన్ల ద్వారా ఈ వ్యక్తి బ్రిటిష్ సైనిక బలగాలను దారి మళ్లించడం, కీలక మిషన్లను అడ్డుకోవడం, వలస పాలకుల వ్యూహాలను పదేపదే చిత్తు చేయడం వంటి పనులు చేస్తున్నప్పటికీ, తన గుర్తింపును మాత్రం బయటపెట్టడం లేదని రివిల్ అవుతుంది. 

ఈ క్యారక్టర్ కి సంబంధించిన మరో ఆసక్తికరమైన అంశం అతని తెలివైన కమ్యూనికేషన్ వ్యవస్థ. భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన ఈ రహస్య కోడ్‌ను ఛేదించడం జర్మనీకి చెందిన ఎనిగ్మా కోడ్‌ను ఛేదించడం కంటే కూడా కష్టమని వివరిస్తారు. ఆ ఆపరేటివ్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, అతని అసలు గుర్తింపు ఏమిటో బ్రిటిష్ వారికి ఇప్పటికీ తెలియదని నేతాజీ వెల్లడించడం అతడిని నీడల్లో పనిచేసే ఓ బలమైన శక్తిగా నిలబెడుతుంది.

‘ఫైల్ నంబర్ 25’లో అత్యంత ఆసక్తికరమైన ఘట్టాల్లో పాత్ర అసలు పేరు, ఐడెంటిటీకి సంబంధించిన అంశం ఒకటి. బ్రిటిష్ అధికారులకు ‘ఫౌజీ’గా తెలిసిన ఈ సైనికుడి అసలు పేరు మాత్రం రహస్యంగానే ఉంటుంది. 1932 నుంచి వలస పాలకులకు కావాల్సిన వ్యక్తిగా ఉన్న అతడిని, తన మాతృభూమిని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్న రెబల్ గా చూపించారు. ప్రస్తుతం ఆ రహస్య ఆపరేటివ్ కలకత్తాలో ఉన్నాడని, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడని నేతాజీ రివిల్ చేస్తారు. 

గ్లింప్స్ చివర్లో ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. వలస పాలకులకు తలవంచడానికి నిరాకరించే  రెబల్ సోల్జర్ గా ఆయన కనిపించారు. పెదవుల మధ్య సిగరెట్, చేతిలో భారీ తుపాకీతో ప్రభాస్ చూపించిన ఆగ్రహం, తిరుగుబాటు తత్వం  మరింత బలాన్ని చేకూర్చాయి. బ్రిటిష్ వారికి ఆయన విసిరే సవాల్‌తో గ్లింప్స్  అదిరిపోయింది. ఇందులో ప్రభాస్ నుంచి ఎలాంటి పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ యాక్షన్‌ను ఆశించవచ్చో ఈ గ్లింప్స్ రుచి చూపించింది.

‘ఫైల్ నంబర్ 25’ ప్రత్యేకత ఏమిటంటే.. హీరో క్యారక్టర్ ని కేవలం శారీరక బలం, యుద్ధభూమిలో చూపించే వీరత్వానికే పరిమితం చేయకపోవడం. రహస్య ఆపరేషన్లు, ఇంటెలిజెన్స్ యుద్ధం, కోడ్ భాషలో సమాచార మార్పిడి, అసలు గుర్తింపును దాచిపెట్టడం వంటి అంశాలు కథలో ఉత్కంఠని పెంచుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యాన్ని భారత స్వాతంత్ర  పోరాటంతో మేళవిస్తూ, విలక్షణమైన చారిత్రక నేపథ్యం, అసాధారణమైన కథానాయకుడితో ‘ఫౌజీ’ ఓ భారీ పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్నట్లు ఈ గ్లింప్స్ సూచిస్తోంది.

 

 

ప్రభాస్ కోసం దర్శకుడు హను రాఘవపూడి ఓ విభిన్నమైన పవర్ ఫుల్ రోల్ రూపొందించాడని అర్ధమవుతుంది.  చారిత్రక అంశాలు, గూఢచర్యం, దేశభక్తి, భారీ యాక్షన్ సన్నివేశాలను కలిపి ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఇమాన్వి హీరోయిన్ కాగా  సీనియర్ నటులు అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీ రోల్స్. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సుదీప్ ఛటర్జీ, సంగీత దర్శకుడిగా విశాల్ చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అనిల్ విలాస్ జాదవ్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు. 2027 మార్చి 19 రిలీజ్.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా  టీ సిరీస్ సమర్పిస్తోంది. 

 

 

[Fauzi Glimpse, Fauzi Glimpse Responce, Prabhas About Fauzi, Fauzi Glimpse Records, Telugu Cinema , TeluguCinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com