Home

»

Latest News

Fauji: ఫౌజీ షూటింగ్ కి వెళ్తున్న కారు నుజ్జు నుజ్జు.. ఒకరు మృతి 

May 5, 2026 11:15AM

-ఈ రోజు ఉదయం ప్రమాదానికి గురైన 'ఫౌజీ యూనిట్ కారు 
-ఒకరు మృతి 
-పలువురుకి గాయాలు 
-ప్రమాదానికి కారణమేంటి

ప్రభాస్(Prabhas)హనురాఘవపూడి కాంబోలో  తెరకెక్కుతున్న 'ఫౌజీ'(Fauji)చిత్ర యూనిట్ ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. యూనిట్ సభ్యులతో ఈ రోజు ఉదయం షూటింగ్ కి వెళ్తున్న  ప్రొడక్షన్ కారు హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది

 కారులో ఆరుగురు యూనిట్ సభ్యులు ఉండగా ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాహనం అదుపు తప్పి రోడ్ పక్కన ఉన్న డివైడర్‌ని  బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ దుర్ఘటనతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: Mohan babu: జయప్రదపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు.. ఇలాంటి అమ్మాయిని ఎలా లాక్కెళ్తారు 

ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ లేరు. కేవలం ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు మాత్రమే ప్రయాణిస్తున్నారు. పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఫౌజీ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది.  మైత్రి మూవీ మేకర్స్  నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com