ENGLISH | TELUGU  

కన్నడ బ్లాక్ బస్టర్ 'లవ్ మాక్‌టైల్ 2' నుంచి 'ఎవరితో పయనం' సాంగ్ విడుదల

on Mar 27, 2024

కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'లవ్ మాక్‌టైల్ 2' నుంచి 'ఎవరితో పయనం' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. ఎవరితో పయనం అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా యోగి సురేష్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్‌టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అదేవిధంగా తను నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన లవ్ మాక్‌టైల్, లవ్ మాక్‌టైల్ 2 చిత్రాలతో కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు లవ్ మాక్‌టైల్ 2 సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ.. "కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. డార్లింగ్ కృష్ణ కన్నడలో బ్లాక్ బస్టర్ హీరోగా మంచి సినిమాల్లో నటించాడు. అతను దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కి సంబంధించిన పాటను నేడు విడుదల చేసాం. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ ప్రమోషన్ యాక్టివిటీస్ తో గ్రాండ్ గా మీ ముందుకు వస్తాం. మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా కూడా అలాగే కంటెంట్ ఉన్న ఒక మంచి సినిమా. గతంలో శివరాజ్ కుమార్ గారి వేద సినిమాకి తెలుగు ప్రేక్షకులు హిట్ చేసి చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇ లవ్ మోక్టెల్ 2 సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.

నకుల్ అభయాన్కర్ సంగీతం అందించిన 'లవ్ మాక్‌టైల్ 2' చిత్రానికి శ్రీ క్రేజీ మైండ్స్ సినిమాటోగ్రాఫర్ గా, ఎడిటర్ గా వ్యవహరించారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.