Home

»

Latest News

ఎపిక్ ట్రైలర్: ఆదిత్య హాసన్ ఇలా చేశాడేంటి?

Sep 5, 2026 1:35PM

'బేబీ' తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ 'ఎపిక్'. '90s' వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న ఆదిత్య హాసన్, ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. '90s' సిరీస్ ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేసేలా ఒక క్లీన్ ఎంటర్టైనర్ లా తెరకెక్కింది. అలాంటి దర్శకుడి నుండి సినిమా వస్తుండటం, పైగా అది '90s' కథకి కొనసాగింపు కావడంతో 'ఎపిక్'పై మొదటినుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఇప్పటిదాకా వచ్చిన కంటెంట్ ఆకట్టుకుంది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ చూసి మాత్రం అందరూ షాక్ అవుతున్నారు.

'ఎపిక్' మూవీ ఒక క్యూట్ లవ్ స్టోరీతో '90s' సిరీస్ తరహాలోనే క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంటుందని భావించారంతా. కానీ, ట్రైలర్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. క్యూట్ లవ్ స్టోరీకి బదులుగా, ఒక బోల్డ్ లవ్ స్టోరీ చూడబోతున్నాం అన్నట్టుగా ట్రైలర్ లో చూపించారు. లండన్ బ్యాక్ డ్రాప్ అని ముందే తెలిసినప్పటికీ.. ఇలా బోల్డ్ గా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. దీంతో నెటిజెన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. "90s డైరెక్టర్ సినిమా కాబట్టి, మంచిగా ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు అనుకున్నాం. కానీ, ఇది ఓన్లీ యూత్ ని టార్గెట్ చేసిన సినిమా అని ఇప్పుడే తెలిసింది" అంటూ కొందరు నెటిజెన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

 

 

 

[Epic Trailer, Anand Deverakonda, Vaishnavi Chaitanya, Aditya Hasan, Naga Vamsi, Telugu Film News, Telugu News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com