"ఈగ" ఆడియో రిలీజ్ మార్చ్ 22 న
on Feb 13, 2012
"ఈగ" ఆడియో రిలీజ్ మార్చ్ 22 న జరుగుతుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ విలన్ గా, డైనమిక్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో, వారాహి పతాకంపై, కొర్రపాటి సాయి నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "ఈగ". ఈ "ఈగ" చిత్రం యొక్క ఆడియోని మార్చ్ 22 వ తేదీన విడుదల చేయటానికి ఈ చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తూంది.
ఇక ఈ చిత్రం కథ విషయానికొస్తే హీరోని విలన్ చంపేస్తే, హీరో ఆత్మ ఒక ఈగలోకి ప్రవేశించి, తనకు జరిగిన అన్యాయానికి ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుందన్నది ఈ చిత్రం కథని తెలిసింది. ఈ చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ కి విపరీతమైన ప్రాథాన్యం ఉందట. అలాగే ఖర్చు కూడా బాగానే అవుతూందని సమాచారం.