అజిత్ డేర్ డెవిల్ లో సిఎం క్యామియో: ఫ్యాన్స్ ని ఆపడం ఇక ఎవరి తరం కాదు!
Nov 24, 2026 4:59PM

స్టార్ హీరో అజిత్ కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ తెలిసిందే. ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'డేర్ డెవిల్' అనే మూవీ అనౌన్స్ చేసాడు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మంచి క్రేజ్ సంపాదించడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాకి సరికొత్త పులకింతలు తీసుకొస్తుంది. అయితే ఆయన ముఖ్యమంత్రి గానా? లేక కథలో కీలకమైన మరో వ్యక్తిగా కనిపిస్తారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు.
ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌తో పాటు కన్నడ సినీ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఒకవేళ ఇది నిజమైతే అజిత్ సినిమాతో డీకే శివకుమార్ వెండితెరపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే ఇప్పటివరకు చిత్రబృందం కానీ, డీకే శివకుమార్ కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.

అజిత్ కెరీర్లో 64వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను ఆయన భార్య షాలిని అజిత్ కుమార్ బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అజిత్‌కి జోడీగా శ్రీలీల కనిపిస్తుండగా ఉన్ని ముకుందన్, శివరాజ్ కుమార్, పార్తిబన్, ప్రభు, సునీల్, రెడిన్ కింగ్స్లీ వంటి ప్రముఖ నటులు కీ రోల్స్.
ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్!
ముఖ్యంగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అజిత్‌కు ఎదురుగా ఆయన చేసే పోరాట సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే 'జైలర్' సినిమాలో నరసింహ పాత్రతో ఇతర భాషల ప్రేక్షకులకు మరింత దగ్గరైన శివన్న.. ఇప్పుడు అజిత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.

నవంబర్ 2న పూజా కార్యక్రమాలతో ప్రారంభమై ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ కొనసాగుతోంది. 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అజిత్ యాక్షన్, అధిక్ రవిచంద్రన్ టేకింగ్, అనిరుధ్ సంగీతం.. ఇలా ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
మీకు నచ్చవచ్చు
తెలుగు సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ కలిసి రావట్లేదా!
[ DK Shivakumar, Ajith, Dare Devil, Adhik Ravichandran, Tollywood, sreeleela]




