Home

»

Latest News

Divyenndu sharma: పెద్ది చేసింది ఆయన కోసమే.. తెలుగోళ్ళకి భలే మర్యాద ఇచ్చావు 

May 26, 2026 12:41PM

 


పెద్ది ట్రైలర్ చూసిన దగ్గర్నుంచి బాలీవుడ్ ప్రముఖ నటుడు దివ్యేందు శర్మ గురించి మాట్లాడుకొని తెలుగు ప్రేక్షకుడు లేడు. 'రాంబుజ్జి' అనే పవర్‌ఫుల్ క్యారక్టర్ లో  కనిపించనున్నాడు. జూన్ 4 కి కౌంట్ డౌన్ మొదలు కావడంతో  ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దివ్యేందు శర్మ పాల్గొని పలు ఆసక్తికర విషయాలని అభిమానులకి, ప్రేక్షకులకి తెలియచేస్తున్నాడు.

 రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు నేను పెద్దిలో చేయడానికి  ప్రధాన కారణం  దర్శకుడు బుచ్చిబాబు. ఉత్తరాఖండ్‌లో ఒక షూటింగ్‌లో బిజీగా ఉన్న సమయంలో 'పెద్ది' చిత్ర బృందం నుంచి ఫోన్ వచ్చింది. ఆ సమయంలో వీలు చూసుకుని వస్తానని చెప్పినప్పటికీ, దర్శకుడు బుచ్చిబాబు నన్ను కలవాలని  వరుసగా మెసేజ్‌లు చేస్తు ఉన్నాడు. కళపై బుచ్చిబాబు చూపించిన  నిబద్ధత, గౌరవం చూసి ఆశ్చర్యపోయాను. అందుకే  షూటింగ్‌ మధ్యలోనే ఆపేసి, ఎంతో శ్రమించి సుదీర్ఘ ప్రయాణం చేసి ఆయనను కలవడానికి వెళ్ళాను. బుచ్చిబాబు తనని  రిసీవ్ చేసుకున్న విధానం, కథని, నా క్యారక్టర్    వివరించిన తీరు  నన్ను ఎంతగానో ప్రభావితం చేసాయి. ఆ క్షణంలోనే, ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే బుచ్చిబాబు కోసమైనా ఈ ప్రాజెక్ట్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.

'కథ విన్నప్పుడు  ఆశ్చర్యానికి లోనయ్యాను. అంత అద్భుతంగా  బుచ్చిబాబుస్క్రిప్ట్‌ రాసాడు.కథలో ఎన్నో ఊహించని మలుపులు,శక్తివంతమైన క్యారక్టర్ లు ఉన్నాయి.సమాజంలో ఒక వ్యక్తి తన సొంత గుర్తింపు కోసం ఎంతటి యుద్ధానికైనా వెనుకాడకూడదనే బలమైన సందేశం పెద్ది ద్వారా వస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ పోషించిన 'పెద్ది'  తన అస్తిత్వం కోసం, కలల కోసం చేసే పోరాటం ప్రేక్షకులని  భావోద్వేగానికి గురిచేస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడం  సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఒక కొత్త భాష, సంస్కృతిని నేర్చుకునే క్రమంలో మళ్లీ సినిమా నిర్మాణ ప్రక్రియతో ప్రేమలో పడ్డాను. తెలుగులో పెద్ద పెద్ద డైలాగులు నేర్చుకుని సొంతంగా పలకడం అంత సులువు కాలేదు. కానీ నా క్యారక్టర్  యొక్క రాజసం ఉట్టిపడేలా శ్వాస తీసుకోకుండా మాట్లాడే డైలాగ్ డెలివరీని ట్రై చేశానని నవ్వుతూ చెప్పారు.

Also read: Rukmini vasanth: రుక్మిణి వసంత్ పిక్స్ మళ్ళీ వైరల్.. ఇంత అందంగా ఉందేంటి

బాలీవుడ్ లో   2007 లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్యేందు శర్మ ప్యార్ కా పంచనామా, చష్మే బద్దూర్, టాయిలెట్ః ఏక్ ప్రేమ్ కథ చిత్రాలలో సహాయక పాత్రలు పోషించాడు. 2018 లో వచ్చిన  మీర్జా పూర్ వెబ్ సిరీస్ తో  అయితే ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com