TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

చైతు మీద ఈమెకి క్ర‌ష్ ఉంద‌ట‌... మ‌రి చైతుకీ?

Feb 1, 2023 11:11AM

అందం, అభినయం, దానికి తగ్గ గ్లామర్ లుక్స్ తో మెప్పించే నటి దివ్యాంశ కౌశిక్. నాగచైతన్య సరసన మ‌జిలి  చిత్రంలో నటించి యువకుల మనసులు దోచింది. టీనేజ్ గర్ల్ గా మంత్రముగ్ధులను చేసింది. తన అందం, నటనతో ఆకట్టుకుంది. రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించింది. కానీ ఈ చిత్రం సరిగా ఆడలేదు. అయినా ఆమె కెరీర్ కు ఎలాంటి డోకా లేదు. పలు తెలుగు చిత్రాలు కమిట్మెంట్‌తో బిజీగా ఉంది. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి నటిస్తున్న మైఖేల్ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. సుదీర్ వర్మ తదుపరి చిత్రంలో ఈమె హీరోయిన్ అని కథనాలు వచ్చాయి. హిందీలోనూ ది వైఫ్ అనే చిత్రంలో దివ్యాంశా నటించింది. మజిలీ చిత్రం సమయంలో దివ్యాంశాతో ప్రేమాయణం సాగించడం వల్లనే సమంతతో నాగచైతన్య బ్రేకప్ అయ్యిందంటూ ఒక ప్రచారం సాగింది. 

బ్రేకప్ తర్వాత ఆ యువ టాలెంట్ ని నాగచైతన్య పెళ్లి చేసుకోనున్నాడ‌ని  కొన్ని మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ అవన్నీ రూమర్లు మాత్రమే. ఐ లవ్ నాగచైతన్య. అతను చాలా అందగాడు. తనపై క్ర‌ష్ఉంది అని తన మనసులోని మాటను బయటపెట్టింది. అయితే అతన్ని ఒక సీనియర్ నటుడిగా గౌరవిస్తాను. చైతన్యతో పెళ్లిపుకార్ల‌ను  నేను వినలేదు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నామని దివ్యాంశ కౌశిక్  తెలిపింది. మొత్తానికి నాగచైతన్య అంటే దివ్యాంశాకు క్రష్ ఉంది. మరి చైతుకు దివ్యాంశా అంటే క్రష్ ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్యకు దివ్యంశ కౌశిక్ తో పాటు శోభితా ధూళిపాళ్ల‌తో  కూడా ఎఫైర్  ఉంద‌ని, వారిద్ద‌రు వివాహం చేసుకోనున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ అవన్నీ పుకార్లేనని తేలిపోయాయి.

google-ad-img