‘అఖండ2’పై అప్డేట్ ఇచ్చిన బోయపాటి.. బాలయ్యకు స్పెషల్ మూవీ అవుతుందట!
on Apr 16, 2024
నందమూరి బాలకృష్ణతో మూడు బ్లాక్‌బస్టర్స్ చేసి డైరెక్టర్‌గా తన రేంజ్‌ని ఒక్కసారిగా పెంచుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను. అతని కెరీర్లో ‘అఖండ’ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రామ్ కాంబినేషన్లో చేసిన ‘స్కంద’పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుందని అంతా ఊహించుకున్నారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ సినిమా డిజాస్టర్ అయింది. ఈ రిజల్ట్‌కి అందరి కంటే ఎక్కువ షాక్ తిన్నది బోయపాటే. హీరోయిజాన్ని ఒక రేంజ్లో ఎలివేట్ చేసే బోయపాటి ‘స్కంద’ చిత్రంలోనూ అదే సూత్రాన్ని పాటించాడు. కానీ, అది ఏ విధంగానూ వర్కవుట్ అవ్వలేదు. పైగా డైరెక్టర్‌గా అతనికి ఎంతో బ్యాడ్ నేమ్ తెచ్చిందా సినిమా. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమా ఏమిటనే ప్రశ్న ఆడియన్స్‌లోనే కాదు, అతనిలోనూ మొదలైంది.
తన తదుపరి సినిమా విషయంలో ఎలాంటి ప్రకటన చేయకుండా సైలెంట్‌గా వుండిపోయాడు బోయపాటి. ఇటీవల లెజెండ్ 10 ఇయర్స్ వేడుకలో బోయపాటిని ఆకాశానికెత్తేసిన బాలయ్య తమ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందని, చరిత్ర సృష్టిస్తుంది అన్నారు. ఆ సమయంలోనే అఖండ2 ప్రస్తావన కూడా వచ్చింది. తప్పకుండా తమ కాంబినేషన్లో ఆ సినిమా ఉంటుందని బోయపాటి కూడా అన్నాడు. అయితే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. బోయపాటి ఒక్కసారిగా వెనకబడిపోవడానికి కారణం ‘స్కంద’ సినిమానే. వాస్తవానికి ఈ సినిమా కంటే ముందే అల్లు అర్జున్‌తో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్లో ‘సరైనోడు’ వంటి సూపర్‌హిట్ మూవీ వచ్చింది. పుష్ప చిత్రం రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్‌లోనే బన్ని ఎక్కువ బిజీ అయిపోవడంతో అప్పట్లోనే బన్నితో అనుకున్న సినిమాను పక్కన పెట్టేసారు. అప్పుడే స్కంద ప్రాజెక్ట్‌లోకి వచ్చాడు బోయపాటి. ఈ సినిమా తేడా కొట్టడంతో ఇప్పుడు ఇతనితో బన్ని సినిమా చేస్తాడో లేదో అనే అందరూ డౌట్ పడుతున్నారు.
ఇక నందమూరి బాలకృష్ణతో ‘అఖండ2’ చెయ్యాల్సి ఉంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య అది పూర్తయిన తర్వాత బోయపాటికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాజెక్ట్ ‘అఖండ2’ అవుతుందా లేక మరో కథతో చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల ఓ సందర్భంలో బోయపాటి తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై నోరు విప్పాడు. ఎన్నికలు పూర్తయిన తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు తెలియజేస్తానని చెప్పాడు. ‘అఖండ2’ చిత్రాన్ని ప్రస్తావిస్తూ ‘సమాజానికి ఎంతో అవసరమైన ఓ అంశాన్ని తీసుకొని ‘అఖండ2’ చేస్తాను. బాలయ్య బాబు కెరీర్లో ఇది కూడా ఓ స్పెషల్ మూవీ అవుతుంది’ అన్నారు.
Also Read