TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

దిల్ రాజు పార్ట్‌న‌ర్ సొంత కుంప‌టి పెట్టుకున్నాడు!

Jun 9, 2020 6:43PM

 

భాగ‌స్వాములుగా దిల్ రాజు, ల‌క్ష్మ‌ణ్‌, శిరీష్ క‌లిసి శ్రీ వేంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమాలు నిర్మించిన విష‌యం తెలిసిందే. కొంత కాలంగా ఆ సంస్థ‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్న ల‌క్ష్మ‌ణ్ త‌న సొంత నిర్మాణ సంస్థ‌ను నెల‌కొల్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 'బ్రిడ్జ్ ప్రొడ‌క్ష‌న్స్' అనే ప్రొడ‌క్ష‌న్ కంపెనీని ప్రారంభిస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ బ్యాన‌ర్‌పై చిన్న సినిమాల నుంచి భారీ బ‌డ్జెట్ మూవీస్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌ని వినోదాన్ని పంచే చిత్రాలు తీయ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

నైజాం ఏరియాలో ప‌లు సినిమాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసి, ఆ రంగంలో విశేషానుభ‌వం గ‌డించిన ల‌క్ష్మ‌ణ్ జ‌డ్జ్‌మెంట్‌.. స్క్రిప్టుల ఎంపిక‌లో ఎలా ఉంటుందో ఇండ‌స్ట్రీలోని వారందిరికీ తెలుసు. కాగా, బ్రిడ్జ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై తొలుత భారీ బ‌డ్జెట్ ఫిలిమ్స్‌ను ఆయ‌న నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లో వాటి వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తారు.

వాస్త‌వానికి, ఏప్రిల్‌లోనే ప్రొడ‌క్ష‌న్ కంపెనీని ప్రారంభించాల‌ని ఆయ‌న అనుకున్నారు. కానీ, కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కార‌ణంగా ఈ విష‌యంలో జాప్యం జ‌రిగింది. సినిమాల నిర్మాణ ప‌నులు ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతాయా, త‌మ‌కు ఎప్పుడు ప‌ని దొరుకుతుందా అని సినీ కార్మికులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న స‌మ‌యంలో, ల‌క్ష్మ‌ణ్ ప్రారంభిస్తున్న నిర్మాణ సంస్థ వారికి ఓ ఆస‌రాగా నిలిచే అవ‌కాశం ఉంది.

google-ad-img