ఐటీ రైడ్స్ ఎఫెక్ట్.. దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత..!
Jan 23, 2025 1:23PM

ప్రముఖ నిర్మాత దిల్ రాజు తల్లి (Dil Raju Mother) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దిల్ రాజు ఇంట్లో మూడో రోజుల నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్ రాజు తల్లి అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఐటీ శాఖకు సంబంధించిన వాహనంలోనే హాస్పిటిల్ కు తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లిన వారిలో దిల్ రాజు కుటుంబ సభ్యులతో పాటు, ఐటీ శాఖకు చెందిన మహిళా అధికారి కూడా ఉన్నారు. ప్రస్తుతం దిల్ రాజు తల్లి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.



