Home

»

Latest News

Dhurandhar 2: ఎందుకు ఈ వివక్ష.. అక్కడ ఒకలా, ఇండియాలో ఒకలా ఎందుకు 

Mar 18, 2026 10:47AM

 


-ఈ రోజు ఈవినింగ్ ఐదు గంటలకి ధురంధర్ 2 
-జోష్ లో అభిమానులు 
-అంచనాలని అందుకుంటుందా!

మరికొన్ని గంటల్లో అభిమానులు, వరల్డ్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'ధురంధర్ పార్ట్ 2'(Dhurandhar 2)సిల్వర్ స్క్రీన్ పై సగర్వంగా టేక్ ఆఫ్ కానుంది. దీంతో వాళ్లంతా థియేటర్స్ కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఈ విషయంలో నేను మీకు అడ్డు రానంటూ ఎండలు కూడా తగ్గుముఖం పట్టి చల్లదనం ఆవహించడంతో ఎలాంటి ఉక్కపోతకి గురి కాకుండానే థియేటర్స్ లోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో ధురంధర్ 2 కి సంబంధించిన ఆసక్తికర న్యూస్ వాళ్ళందర్నీ సాయంత్రం ఐదు గంటల షోకి వెళ్ళేదాకా వెంటాడుతూనే ఉండబోతుంది. మరి ఆ ఆసక్తికర న్యూస్ ఏంటో చూద్దాం.

ధురంధర్ పార్ట్ 2 డ్యూరేషన్  ఇండియాలో మూడుగంటల నలభై తొమ్మిది నిమిషాల ఆరు సెకన్లుగా మేకర్స్ ఫిక్స్ చేసారు. ఓవర్ సీస్ లో మాత్రం సదరు డ్యూరేషన్ కి అదనంగా మరో ఆరు సెకన్లు యాడ్ కానుంది. అంటే ఓవర్ సీస్ డ్యూరేషన్ మూడు గంటల యాభై ఐదు నిమిషాలు. పార్ట్ 1 డ్యూరేషన్ మూడు గంటల ముపై నాలుగు నిమిషాలుగా అన్ని చోట్ల ప్రదర్శించిన విషయం తెలిసిందే.  మరి ఇప్పుడు ఈ తేడా ఎందుకో సిల్వర్ స్క్రీన్ ముందు ప్రత్యక్షమయ్యాక గాని అభిమానులు,ప్రేక్షకులు తెలుసుకునే అవకాశం ఉంది.

also read: Mangli: మంగ్లీపై కేసు నమోదు చేసిన ముంబై లాయర్ వినీత్ జిందాల్.. రీజన్ తెలిస్తే షాక్

రణవీర్ సింగ్(Ranveer Singh),సంజయ్ దత్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్, మాధవన్ కి షాట్ చెప్తూ దర్శకుడు ఆదిత్య ధర్(Aditya Dhar)ఈ సారి ధురంధర్ 2 ద్వారా ఇండియా గొప్పతనాన్ని ఎలా చెప్పబోతున్నాడో, అదే విధంగా పార్ట్ 2 తోనే ధురంధర్ కి గ్రాండ్ సెండ్ ఆఫ్ చెప్పబోతున్నారా లేక పార్ట్ 3 కూడా ఉంటుందా అనే  ఆసక్తి కూడా అందరిలో ఉంది. 



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com