Home

»

Latest News

Dacoit: ఓటీటీలోకి డెకాయిట్..  డేట్ ఇదేనా!

Apr 29, 2026

 


డెకాయిట్(Dacoit).. ఏ సమయంలో స్టార్ట్ అయ్యిందో గాని, లేక మేకర్స్, నటుల జాతకం బాగుందో కానీ, ఈ మధ్య కాలంలో నెగిటివ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త హిస్టరీని సృష్టించింది. మరి ఓవరాల్ గా 50 కోట్లకి పైగా రాబట్టడం అంటే మాములు విషయమా చెప్పండి. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి  వేదికగా రాబోతుందన్న సంకేతాలు చాలా బలంగానే సోషల్ మీడియాలో ఇండిపెండెంట్ హోదాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ డేట్ ఏంటో చూద్దాం.

డెకాయిట్  డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు సంస్థ మే 8 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా టాక్ . ఈ మేరకు మేకర్స్, నెట్ ఫ్లిక్స్ నుంచి త్వరలోనే  అధికార ప్రకటన రానున్నట్టుగా తెలుస్తుంది  తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ ఒకేసారి  స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటన ఎంతగానో కట్టిపడేస్తుంది. మరి మే 8  న 
డెకాయిట్ కి రెడీ  అయిపోండి.

Also read: Nithya Menen: పెళ్లి, మాతృత్వంపై నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్

 అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌  సంయుక్తంగా డెకాయిట్  నిర్మించారు. ప్రకాశ్ రాజ్ ,సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల, జయన్ మేరీ ఖాన్, జరీనా వాహబ్  తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ . భీమ్స్ సిసిరీలియో మ్యూజిక్ కాగా షానీల్ డియో దర్శకుడు 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com