
-సినిమా పేరు: క్రేజీ కళ్యాణం
-నటీనటులు: అనుపమ పరమేశ్వరన్, సీనియర్ నరేష్, తరుణ్ భాస్కర్,అఖిల్ రాజ్, కిరీటి దామరాజు తదితరులు
-సినిమాటోగ్రఫీ: శ్యామ్ ధూపాటి
-ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
-మ్యూజిక్: సురేష్ బొబ్బిలి
-నిర్మాత: భూసం జగన్ మోహన్ రెడ్డి
-బ్యానర్: ఆరోవ్ సినిమాస్
-రచన,దర్శకత్వం: భద్రప్ప గాజుల
-రిలీజ్ డేట్ : అక్టోబర్ 16 , 2026
అనుపమ పరమేశ్వరన్ , నరేష్ తండ్రి కూతుళ్లుగా చేసిన మూవీ 'క్రేజీ కళ్యాణం'. ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టగా, ప్రచార చిత్రాలతోనే మంచి బజ్ ని ఏర్పరచుకుంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
కీర్తి (అనుపమ పరమేశ్వరన్) తెలంగాణాలోని మెదక్ చెందిన అందమైన యువతి. ఆత్మాభిమానం, ధైర్య సాహసాలు, స్వతంత్ర భావాలు మెండుగా ఉండటంతో పాటు చదువులో నెంబర్ వన్ స్టూడెంట్.. ఒక రకంగా చదువంటే విపరీతమైన పిచ్చి. MS కంప్యూటర్స్ చదువుతుంటుంది. తన తండ్రి పర్వతాలు(నరేష్) అన్నా, తన కుటుంబం అన్నా ఎంతో అభిమానం. పర్వతాలు మంచోడే కానీ కొంచం స్వార్దపరుడు. ఆ కోవలోనే తన అన్నయ్య కూతురుకి వచ్చిన అమెరికా పెళ్లి సంబంధాన్ని కీర్తికి సెట్ చేస్తాడు? కీర్తి పెళ్ళికి ఒప్పుకోదు. కానీ పెళ్ళి ఏర్పాట్లు చేస్తాడు? మరి పర్వతాలు ఏర్పాటు చేసిన పెళ్లి జరిగిందా? అసలు ధైర్య సాహసాలు కలిగిన కీర్తి పెళ్లి మండపం దాకా ఎందుకు వచ్చింది? ఆమె మనసులో ఎవరైనా ఉన్నారా? చివరకి కీర్తి గెలిచిందా? పర్వతాలు గెలిచాడా అనేదే క్రేజీ కళ్యాణం.
ఎనాలసిస్
మూవీ చూస్తున్నంత సేపు బోర్ కొట్టకుండా ఆహ్లాదకరంగా సాగింది. కానీ కీర్తి బాగా తెలివైంది కాబట్టి, తన తండ్రిని బాధపెట్టకుండా తండ్రి కోరిక ప్రకారమే పెళ్ళికి ఒప్పుకొని, తన లవర్ ఉదయ్( అఖిల్ రాజ్) బావ( తరుణ్ భాస్కర్) తో కలిసి మాయ చేసి తన తండ్రే నీకు ఇష్టమొచ్చిన అబ్బాయిని చేసుకో అనేలా చేసి ఉంటే క్రేజీ కళ్యాణం ఇంకా బెటర్ పొజిషన్ లో ఉండేది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కీర్తి ఇంట్రడక్షన్ తో పాటు ప్రతి ఒక్కరి ఇంట్రడక్షన్ కి కనెక్ట్ సీన్స్ లింక్ చేసుకుంటూ వచ్చిన సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా ఆల్కహాల్ అడిట్ బాలరాజు( తరుణ్ భాస్కర్) సీన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఈ క్యారక్టర్ పై ఇంకా సీన్స్ క్రియేట్ చేసి మంచి ఎంటర్ టైన్ మెంట్ ని సృష్టించాల్సింది.
నరేష్, నరేష్ మదర్, కీర్తి మధ్య వచ్చిన సీన్స్ నాచురల్ గా ఉండటం ప్లస్ పాయింట్. కీర్తి, ఉదయ్ మధ్య వచ్చిన సీన్స్ మాములే. ఎలాంటి మెరుపులు లేవు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. సెకండ్ హాఫ్ చూసుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ఏర్పడింది. పెళ్లి జరుగుతుంటే తన తల్లి చనిపోయినా, ఆ విషయాన్నీ దాచి కీర్తికి పెళ్లి జరిపించాలనుకునే ఎపిసోడ్ బాగా పేలింది. కానీ ఆమె బతికే ఉందనే థ్రిల్ ని మాత్రం సింపుల్ గా తేల్చేసారు. ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ బాగున్నాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు
కీర్తిగా అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన నాచురల్ పెర్ఫార్మ్ తో ఆకట్టుకుంది. అన్ని రకాల ఎమోషన్స్ ని అవలీలగా పండించింది. నరేష్ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పర్వతాలు అనే క్యారక్టర్ లో జీవించేసారు. అసలు ఆ క్యారక్టర్ లేనిదే సినిమానే లేదు. ఎవరైనా నటన నేర్చుకోవాలనుకంటే పర్వతాలు క్యారక్టర్ ని చూసి నేర్చుకోవచ్చు. ఇక తరుణ్ భాస్కర్ కూడా అంతే. తన అద్భుతమైన పెర్ఫార్మ్ తో సినిమాకి మరో బలంగా నిలిచాడు. సరైన సినిమా పడితే రాబోయే రోజుల్లో తెలుగు సినిమాని ఏలతాడని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉదయ్ గా చేసిన అఖిల్ రాజ్ తో పాటు మిగతా అందరూ కూడా తమ క్యారెక్టర్స్ పరిధి మేరకు మెప్పించారు. దర్శకుడిగా భద్రప్ప మెప్పించాడు. రైటర్ గా సోసో. నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ బాగున్నాయి.
బలాలు
1 . అనుపమ పరమేశ్వరన్, నరేష్ పెర్ ఫార్మెన్స్
2 . కథనం
బలహీనతలు
1 .ఎంటర్ టైన్ మెంట్ ని మరింతగా ఎలివేట్ చెయ్యకపోవడం
చివరిగా చెప్పుకోవాలంటే అసభ్యతకి తావు లేని విధంగా మంచి పాయింట్ తో క్రేజీ కళ్యాణం సాగింది.
రేటింగ్ 2 .5 /5
అరుణాచలం






