.webp)
శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను ఏర్పాటు చేసుకున్న ఆయన.. ఈసారి ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
‘కామ్రేడ్ కళ్యాణ్’ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు రూ.4.15 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేశారు.
శ్రీవిష్ణు గత చిత్రాలు ‘విష్ణు విన్యాసం’, ‘మృత్యుంజయ్’తో పోలిస్తే బెటర్ ఓపెనింగ్స్ రావడం విశేషం. టాక్ కూడా బెటర్ గా ఉంది. ముఖ్యంగా కామెడీకి అందరూ కనెక్ట్ అవుతున్నారు. దీంతో ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోయే రోజుల్లో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది కీలకంగా మారింది.
జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన మహిమా నంబియార్ నటించారు. రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే, సత్య, తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
ఈ సినిమా కథ 1990ల కాలంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని 'మాడుగుల' అనే ఏజెన్సీ ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. నక్సల్స్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ ఈ సినిమాని ఆద్యంతం వినోదభరితంగా మలచడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మొత్తానికి తొలి రోజు రూ.4.15 కోట్ల గ్రాస్‌తో సత్తా చాటిన ‘కామ్రేడ్ కళ్యాణ్’.. వీకెండ్‌లో మరింత పుంజుకొని, శ్రీవిష్ణుకు మరో మంచి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.
ఇది కూడా చదవండి: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్‌కు యష్ గ్రీన్ సిగ్నల్.. ఆ సినిమా రిలీజ్ కాకముందే బంపరాఫర్.!
[Comrade Kalyan Day 1 Collections, Comrade Kalyan Day 1 Gross, Comrade Kalyan Collections, Comrade Kalyan Box Office, Comrade Kalyan Movie, Sree Vishnu, Kona Venkat, Telugu Film News]






