తెలంగాణ కుర్రాడి పాన్ వరల్డ్ మూవీ
on Nov 23, 2022
"మన తెలుగు సినిమాలు వంద కోట్లు సంపాదిస్తే ఎగిరి గంతేస్తున్నాం. కానీ మనం సినిమాలు తెలుగులోనే ఎందుకు తీయాలి? ఇంగ్లీషులో తీసి మనమూ ఎందుకు వందల కోట్లు సంపాదించకూడదు " అంటున్నాడు తెలంగాణకు చెందిన యువ దర్శకుడు నవీన్ ముళ్లంగి. బిజినెస్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేసి, ఓ మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్న ఈ పాతికేళ్ల ఖమ్మం కుర్రాడు.. తనే హీరోగా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా ఇంగ్లీషులో ఓ ఫిల్మ్ తీసి ట్రెండ్ సెట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
పరస్పర విరుద్ధమైన భావజాలం కలిగిన ఓ అబ్బాయి, అమ్మాయి నడుమ నడిచే యూనిక్ లవ్ స్టోరీగా 'కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ - క్యాపిటలిస్ట్ బాయ్ ఫ్రెండ్' పేరుతో నవీన్ తీసిన ఈ చిత్రం షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తి చేసుకుంది. గంటన్నర నిడివి గల ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల కానుంది.
వాటర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన 'కమ్యూనిస్ట్ గర్ల్ ఫ్రెండ్ - క్యాపిటలిస్ట్ బాయ్ ఫ్రెండ్' చిత్రంలో నవీన్ సరసన శివ ప్రీతిక సుక్క హీరోయిన్ గా నటించింది. ఇలియాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు.