Home

»

Latest News

చిరంజీవి ‘కాకా’ యంగ్ లుక్ లీక్: వీడియోలో మెగాస్టార్ స్టైల్ అదుర్స్.!

Oct 19, 2026 5:51PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’ నుంచి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు మేకర్స్ బయటపెట్టని చిరంజీవి యంగ్ లుక్ ఈ వీడియోలో కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. సెట్స్‌లో రహస్యంగా చిత్రీకరించినట్లు చెబుతున్న ఈ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వైరల్ అవుతున్న ఈ వీడియో నిడివి 20 సెకన్లలోపే ఉంది. ఇందులో చిరంజీవి స్టైలిష్ గెటప్‌లో, కళ్లకు సన్‌గ్లాసెస్ ధరించి, సిగార్ తాగుతూ కనిపిస్తున్నారు. నటుడు మురళీధర్ గౌడ్‌తో ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ లుక్‌ను అధికారికంగా విడుదల చేయకపోవడంతో, లీకైన వీడియోలో మెగాస్టార్‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. డ్రెస్సింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్ అదిరిపోయాయి. ముఖ్యంగా హెయిర్ స్టైల్, కోర మీసం, చెవి రింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’లో చిరంజీవి రెండు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌ లో ఒకవైపు సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా కనిపించి ఆకట్టుకున్నారు. ఇక తాజాగా లీకైన వీడియోలో యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌తో అదరగొడుతున్నారు.

మరి ఈ వీడియో బయటకు రావడంతో చిత్రబృందం త్వరలోనే ఆ లుక్‌కు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను విడుదల చేస్తుందా? లేక ఈ లుక్‌ను తెరపైనే చూసేలా సస్పెన్స్‌లో ఉంచుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: మెగా షాక్.. రామ్ చరణ్ ‘RC17’ మూవీ లాంచ్‌కి బ్రేక్.!

 

 

 

[Chiranjeevi Young Look from Kaaka, Chiranjeevi Kaaka Movie, Kaaka Leaked Look, Chiranjeevi Viral Video, Kaaka Leaked Video, Chiranjeevi Kaaka, Kaaka Movie, Megastar Chiranjeevi, Bobby Kolli, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com