Home

»

Latest News

చిరు–కార్తీక్ సుబ్బరాజ్ కాంబోపై క్లారిటీ.. డైరెక్ట‌ర్‌ ఏమన్నారంటే.?

Oct 18, 2026 6:41PM

మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారు? ఎలాంటి కథను ఎంచుకుంటున్నారు? అనే విషయాలు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందనే వార్తలకు మరింత బలం చేకూరింది. రజినీకాంత్‌తో ‘పేట’ వంటి సినిమాను తెరకెక్కించిన కార్తీక్ సుబ్బరాజ్.. చిరంజీవికి కథ వినిపించినట్లు స్వయంగా వెల్లడించారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై మెగా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ఇటీవల ‘పర్మిట్ రూమ్’ అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కార్తీక్ సుబ్బరాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. “చిరంజీవి గారికి ఒక కథ వినిపించాను. అయితే, ఇప్పటివరకు ఏదీ ఖరారు కాలేదు. ఆయనతో కలిసి పనిచేస్తానని ఆశిస్తున్నాను” అని తెలిపారు. దీంతో చిరంజీవి కోసం కార్తీక్ ఓ కథను సిద్ధం చేసి వినిపించిన విషయం స్పష్టమైంది. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి మెగాస్టార్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని దర్శకుడి మాటలను బట్టి అర్థమవుతోంది.

‘పిజ్జా’, ‘జిగర్తాండ’, ‘మహాన్’ వంటి విభిన్నమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్.. రజినీకాంత్‌తో ‘పేట’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన సినిమాల్లో కొత్త తరహా కథనం, స్టైలిష్ మేకింగ్‌కు ప్రాధాన్యం ఇచ్చే ఆయన.. చిరంజీవితో సినిమా చేస్తే ఎలాంటి కథను ఎంచుకుంటారన్న ఆసక్తి నెలకొంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌పై వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు దర్శకుడే కథ చెప్పినట్లు వెల్లడించడంతో చర్చ మళ్లీ మొదలైంది.

ప్రస్తుతం చిరంజీవి తన ఇతర సినిమా పనులతో బిజీగా ఉన్నారు. మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ కూడా తన ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? చిరంజీవి ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి కథ వినిపించిన విషయం మాత్రమే అధికారికంగా వెల్లడైంది. సినిమా ఖరారైనట్లు మాత్రం ఇంకా ప్రకటన రాలేదు.

 

 


[Chiranjeevi, Karthik Subbaraj, Chiranjeevi Karthik Subbaraj Movie, Petta Director, Karthik Subbaraj Latest News, Megastar Chiranjeevi Upcoming Movies, Chiranjeevi New Movie]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com