Home

»

Latest News

నెక్స్ట్ ఏంటి: ‘కాకా’ తర్వాత చిరంజీవి సినిమా ఎవరితో.?

Oct 19, 2026 6:53PM

మెగాస్టార్ చిరంజీవి తర్వాతి సినిమా ఎవరితో ఉండబోతోంది? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ ప్రశ్న ఆసక్తిని పెంచుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ తర్వాత చిరంజీవి చేయాల్సిన శ్రీకాంత్ ఓదెల సినిమా ఎప్పుడు మొదలవుతుందనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఇదే సమయంలో తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు పేరు తెరపైకి రావడంతో మెగాస్టార్ తదుపరి ప్రాజెక్ట్‌పై కొత్త చర్చ మొదలైంది.

‘జిగర్‌తండా’, ‘పేట’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు.. చిరంజీవికి ఓ కథ వినిపించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నది ఇంకా తెలియలేదు.

కార్తీక్ సుబ్బరాజు సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భిన్నమైన కథనం, బలమైన పాత్రలు కనిపిస్తుంటాయి. అలాంటి దర్శకుడు చిరంజీవి కోసం ఎలాంటి కథను సిద్ధం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కాంబినేషన్ ఖరారైతే, మెగాస్టార్‌ను ఆయన ఏ తరహా పాత్రలో చూపిస్తారనేది అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచే అంశం.

‘దసరా’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెలతో చిరంజీవి ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. నాని నిర్మాణంలో రూపొందాల్సిన ఈ ప్రాజెక్ట్‌పై అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే శ్రీకాంత్ ఓదెల ‘ది పారడైజ్’ సినిమా అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకోవడంతో చిరంజీవి సినిమా షెడ్యూల్ కూడా మారిపోయింది.

ఈ విషయంపై నాని ఇటీవల మాట్లాడుతూ.. ‘ది పారడైజ్’ ఆలస్యం కావడంతో చిరంజీవి సినిమా అనుకున్న సమయానికి ముందుకు వెళ్లలేదని, ఈ ప్రాజెక్ట్‌ గురించి మళ్లీ కూర్చొని చర్చించలేదని తెలిపారు. కాబట్టి సినిమా పూర్తిగా ఆగిపోయిందని చెప్పలేం. కానీ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై మాత్రం స్పష్టత లేదు.

శ్రీకాంత్ ఓదెల సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో చిరంజీవితో సినిమా చేయాలని బుచ్చిబాబు సానా, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ వంటి దర్శకులు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. అయితే వీరిలో ఎవరితోనూ చిరంజీవి సినిమా అధికారికంగా ఖరారు కాలేదు.

ప్రస్తుతం చిరంజీవి దృష్టి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’పై ఉంది. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో ముందుకు వెళ్తారా? లేక కార్తీక్ సుబ్బరాజుకు అవకాశం ఇస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: ‘మాలా’ సాంగ్ వచ్చేసింది.. వెంకటేష్, నివేదా పేతురాజ్ కెమిస్ట్రీ అదిరింది.!

 

 

 

[Chiranjeevi Next Film, Chiranjeevi Kaaka Movie, Megastar Chiranjeevi, Karthik Subbaraj, The Paradise Movie, Srikanth Odela, Kaaka Movie, Nani, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com