TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

‘ఆటో జానీ’ గుర్తున్నాడా?.. ‘కాకా’లో చిరంజీవి వింటేజ్ అవతార్‌ అదిరింది.!

Nov 29, 2026 11:38AM

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆయన నటిస్తున్న ‘కాకా’ సినిమా నుంచి తాజాగా విడుదలైన పోస్టర్‌లో చిరు ‘ఆటో జానీ’గా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సంక్రాంతికి థియేటర్లలో మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు సిద్ధమవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘ఆటో జానీ’ అనే పేరు వినగానే మెగా అభిమానులకు 'రౌడీ అల్లుడు' సినిమా నాటి పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు అదే పేరుతో చిరంజీవి కొత్త మాస్‌ అవతార్‌లో కనిపించబోతుండటంతో సోషల్‌ మీడియాలో ఈ పోస్టర్‌ ఆసక్తి రేపుతోంది. కళ్లకు నల్లటి కళ్లద్దాలు, నడుము దగ్గర గన్, చేతులతో కాలర్ పైకెత్తి మాస్‌ స్టైల్‌లో ఉన్న చిరు లుక్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది.

బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి మరోసారి తనదైన మాస్‌ టైమింగ్‌, కామెడీ, యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమా విడుదల తేదీని కూడా పోస్టర్‌లో మరోసారి స్పష్టం చేశారు. 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీంతో వచ్చే సంక్రాంతికి మెగాస్టార్‌ నుంచి మాస్‌ ట్రీట్‌ ఖాయమైంది.

మొత్తానికి ‘ఆటో జానీ ఈజ్‌ బ్యాక్‌’ అంటూ చిరంజీవి ఇచ్చిన ఈ కొత్త పరిచయం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. మరి ‘కాకా’లో ఆటో జానీగా మెగాస్టార్‌ ఎలాంటి వినోదాన్ని పంచుతారో చూడాలి.

ఇది కూడా చదవండి: చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్?

 

 

 

[Chiranjeevi, Auto Johnny, Kaaka Movie, Bobby Kolli]

 

google-ad-img