
-చిరు, బాబీ మూవీ ఉందా!
-కొన్ని రోజులుగా నెగిటివ్ స్ప్రెడ్
-ఇంటర్వెల్ తో వస్తున్నారు
ఒక అభిమాని తన అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరు. సెల్యులాయిడ్ కూడా సదరు కిక్ ని ఒంటి నిండా పులుముకొని ఘనవిజయాన్ని అందిస్తుంది. చిరంజీవి(Chiranjeevi),బాబీ(Bobby)కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్యనే అందుకు ఉదాహరణ. దీంతో ఈ కాంబోలో తెరకెక్కబోతున్న కొత్త మూవీపై అంచనాలు పీక్ లో ఉన్నాయి. రీసెంట్ గా ఈ కాంబోకి సంబంధించిన తాజా న్యూస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ లో క్రేజీ న్యూస్ గా మారింది. మరి ఆ మెగా న్యూస్ ఏంటో చూసేద్దాం
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాబీ ఒక పవర్‌ఫుల్ ఇంటర్వెల్ బ్లాక్‌ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ తరహాలో ఉండే ఈ సీక్వెన్స్ పూర్తిగా చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టుగా, వింటేజ్ చిరుని గుర్తుకు తెచ్చేలా భారీ స్థాయిలో ఉండబోతోందని సమాచారం. మరి బాస్ సినిమాల్లో ఇంటర్వెల్ బ్లాక్ అనేది ఎప్పుడూ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ,ముఖ్యంగా 'ఇంద్ర', 'ఠాగూర్' లో ని ఇంటర్వెల్ సీన్లు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పుడు బాబీ కూడా అదే రేంజ్‌లో ఒక మాస్ ఎలివేషన్‌ను ప్లాన్ చేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో థియేటర్లలో ఇంటర్ వెల్ సీన్స్ కి మెగా ఫ్యాన్స్ సీట్ల నుంచి లేచి గోల చేయడం ఖాయమని ఇండస్ట్రీ టాక్.
Also read: Mehreen Pirzada: మెహ్రీన్ పెళ్లి చేసుకుంది ఇతన్నే.. ఫస్ట్ ఎంగేజ్ మెంట్ కి, ఇప్పటి పెళ్లికి తేడా ఇదే
ఇక ఈ చిత్రం ఆగిపోయిందనే రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. సదరు న్యూస్ స్ప్రెడ్ చేసే బ్యాచ్ కి మెగా టీం ఒక షాకింగ్ న్యూస్ ని చెప్పింది. త్వరలోనే మూవీ షూట్ కి వెళ్లబోతుందని అధికార ప్రకటన చేసింది. ప్రాజెక్ట్ కి సంబంధించిన మిగతా నటీనటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.






