TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

చిరంజీవి ఒరిజినల్ సర్టిఫికెట్ వైరల్..మొత్తం క్లియర్ గా బయటపడింది

Mar 19, 2024 1:06PM

స్వయంకృషి తో హిమాలయ శిఖరాలంత ఎత్తుకి ఎదిగిన నటుడు చిరంజీవి. ఆయన సినిమా  రిలీజ్ అయిందంటే  చాలు ఆబాలగోపాలం ఆనందంతో మురిసిపోతుంది.ఇక ఫ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. తెర మీద ఆయన కనపడగానే విజిల్స్ తో థియేటర్ మొత్తం మోత మోగిపోయేలా చేస్తారు. నాలుగున్నర దశాబ్దాలుగా ఇదే తంతు. చిరంజీవిని హీరోగానే కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా కూడా చాలా మంది భావిస్తారు. అందుకే  సినిమాలే కాకుండా  పర్సనల్ విషయాలు కూడా సంచలనం సృష్టిస్తు ఉంటాయి. ఈ విషయం ఎన్నో సార్లు రుజువయ్యింది. తాజాగా  మరో పర్సనల్ వార్త సంచలనం సృష్టిస్తుంది.  

సోషల్ మీడియాలో చిరుకి  సంబంధించిన టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికెట్  దర్శనం ఇస్తుంది. చిరంజీవి పూర్తి పేరు కేఎస్‌ఎస్‌ వర ప్రసాద్‌ అని, తండ్రి పేరు వెంకట్‌ రావు అని ఉంది.అలాగే  చిరంజీవి పెనుగొండ లో పుట్టినట్లుగా ఉండటంతో పాటుగా అగస్ట్ ఇరవై రెండు పందొమ్మిది వందల యాభై ఐదు డేట్ ఆఫ్ బర్త్ గా ఉంది. అలాగే పుట్టు మచ్చలు గురించి కూడా వివరంగా ఉంది. ప్రస్తుతం  ఈ సర్టిఫికెట్‌  వైరల్‌ అవుతోంది.అఫ్ కోర్స్ ఈ విషయాలన్నీ ఎప్పటినుంచో అందరకి తెలుసనుకోండి. కాకపోతే మెగాస్టార్ ది  కదా వైరల్ గా మారింది. అసలు ఈ సర్టిఫికెట్ ఎలా బయటకి వచ్చిందనే విషయం లో మాత్రం ఎవరకి క్లారిటీ లేదు.  ఫ్యాన్స్ మాత్రం ఆ సర్టిఫికెట్  చూసి చాలా హ్యాపీ గా ఫీలవుతున్నారు.

చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర తో బిజీగా ఉన్నాడు భోళాశంకర్ ప్లాప్ తో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో చేస్తున్నాడు. పైగా సోషియో ఫాంటసీ మూవీ కూడా  కావడంతో మెగా అభిమానుల్లో ప్రేక్షకుల్లో  విశ్వంభర పై భారీ అంచనాలే ఉన్నాయి. 2025 జనవరి 10 న మూవీ  విడుదల కాబోతుంది. వశిష్ట దర్శకుడు కాగా యువి క్రియేషన్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
 

google-ad-img