TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

చావా పై వంద కోట్ల దావా వేస్తామంటున్న వారసులు..ఇంత కంటే అవమానం ఉందా  

Feb 24, 2025 2:06PM

'మరాఠా సామ్రాజ్యాన్ని'స్థాపించిన వీర యోధుడు 'చత్రపతి శివాజీ మహారాజ్'(shivaji maharaj)వారసుడు'ఛత్రపతి 'శంభాజీ మహారాజ్' (Shambhaji Maharaj)జీవిత కథని ఆధారంగా చేసుకొని నిర్మించిన చిత్రం 'చావా'. ఫిబ్రవరి 14 న విడుదలైన ఈ చారిత్రాత్మక మూవీలో'శంభాజీ మహారాజ్' గా 'విక్కీ కౌశల్' తన కెరీరి లోనే అత్యత్తుమ నటనని కనపర్చాడు.ఆయన భార్య 'యేసుభాయి' గా స్టార్ హీరోయిన్ రష్మిక కూడా తన క్యారక్టర్ లో ఒదిగిపోయి నటించింది.లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్(lakshman Ramachandra utekar)దర్శకత్వంలో దినేష్ విజయన్ (Dinesh VIjayan)ఈ చిత్రాన్ని నిర్మించాడు.
 
 ఈ మూవీ కథ ప్రకారం 'శంభాజీ మహారాజ్' ని ఔరంగజేబు సైన్యానికి గానోజీ, కన్హోజీ లు పట్టిస్తారు. ఈ ఇద్దరు కూడా శంభాజీ మహారాజ్ దగ్గర నమ్మకంగా పని చేస్తూనే ఆ దారుణానికి ఒడిగడతారు.దీంతో ఔరంగజేబు 'శంభాజీ మహారాజ్' ని అత్యంత దారుణంగా రకరకాల చిత్ర హింసలకి గురి చేస్తు చంపేస్తాడు.ఈ విషయంపై గానోజీ, కన్హోజీ వారసులు మాట్లాడుతు మా పూర్వీకులని సినిమాలో తప్పుగా చూపించారు.వెంటనే మా పూర్వీకుల సన్నివేశాల్లో తగిన మార్పులు చెయ్యకపోతే న్యాయపోరాటానికి సిద్ధం.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని దర్శకుడు 'లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్' కి నోటీసులు పంపించడం జరిగింది .

దీంతో గానోజి,కన్హోజీ వారసులకి లక్ష్మణ్ ఫోన్ చేసి క్షమాపణలు చెప్పడం జరిగింది.గానోజి,కన్హోజీ  లని తప్పుగా చూపించే ఉద్దేశ్యం తమకి లేదని, అందుకే వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళో చూపించలేదని కూడా వాళ్ళకి చెప్పాడన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.చావా మూవీ అయితే వరల్డ్ వైడ్ గా రికార్డు కలెక్షన్స్ తో  దూసుపోతుంది. ఓరంగజేబు గా అక్షయ్ ఖన్నా నటించగా అశుతోష్ రానా, ప్రదీప్ రావత్, వినీత్ కుమార్ సింగ్, దివ్య దుత్త లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు. చావా అంటే పులి పిల్ల అని అర్ధం.

 

google-ad-img