ఆగస్ట్ నుంచి 'బిగ్ బాస్ 4'?
on May 26, 2020
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన 'బిగ్ బాస్ 3' తెలుగు బ్లాక్‌బస్టర్ హిట్టయింది. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఇటు సినీ, అటు టీవీ రంగాలకు చెందిన అన్ని రకాల పనులూ ఆగిపోయాయి. రెండు నెలల తర్వాత పెండింగ్‌లో ఉన్న పనులు ఒక్కటొక్కటిగా తిరిగి మొదలవుతున్నాయి. కాగా 'బిగ్ బాస్ 4' షో హోస్ట్‌గా తిరిగి నాగార్జున రానున్నారనే వార్త కొంత కాలంగా ఇండస్ట్రీలో నలుగుతున్న విషయం చాలా మందికి తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం, ఈ వివాదాస్పద రియాలిటీ గేమ్ షో నాలుగో సీజన్ స్టార్ మా చానల్లో జూలై లేదా ఆగస్ట్‌లో ప్రారంభం కానున్నది. 'బిగ్ బాస్ 1'కు జూనియర్ ఎన్టీఆర్, 'బిగ్ బాస్ 2'కు నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఇక నాగార్జున హోస్ట్‌గా చేసిన మూడో సీజన్ మునుపటి సీజన్లకు సంబంధించిన పలు రికార్డులను బద్దలుకొట్టింది. టీఆర్పీలో కొత్త రికార్డులు సృష్టించింది. 'బిగ్ బాస్ 4'కు సైతం ఇదే రకమైన స్పందనను నిర్వాహకులు ఆశిస్తున్నారు.
ఇన్సైడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న దాని ప్రకారం నాలుగో సీజన్ ఫార్మట్‌లో నిర్వాహకులు కొన్ని మార్పులు చేస్తున్నారు. అంటే మునుపటి మూడు సీజన్లతో పోలిస్తే 'బిగ్ బాస్ 4' కాస్త భిన్నంగా కనిపించనున్నది. నిజానికి ఈ నాలుగో సీజన్‌ను జూన్‌లో స్టార్ట్ చేయాలని మొదట అనుకున్నారు. కానీ లాక్డౌన్ కారణంగా పనులు ఆగిపోవడంతో అనివార్యంగా షో వాయిదాపడింది. ఆగస్ట్ 2న ఈ షో మొదలవుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రస్తుతం నడుస్తోంది.
Also Read