రామ్ కంటే బోయపాటికే ఎక్కువ పారితోషికం!?
on Feb 6, 2022

`అఖండ`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను. ఆ చిత్రంలో నటసింహ నందమూరి బాలకృష్ణని అఘోరాగా నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ప్రజెంట్ చేసి.. టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారాయన. కాగా, త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారట బోయపాటి. `పుష్ప - ద రూల్` తరువాత ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కనుందట. బన్నీ - బోయపాటి కాంబోలో `సరైనోడు` చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ సంస్థనే ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుందని టాక్.
ఇదిలా ఉంటే.. బన్నీ కాంబినేషన్ మూవీ కంటే ముందు బోయపాటి శ్రీను మరో సినిమాని డిజైన్ చేసుకుంటున్నారట. ఇందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తాడని బజ్. కాగా, ఈ సినిమా కోసం రామ్ రూ. 9 కోట్ల పారితోషికం అందుకోనుండగా, బోయపాటి ఏకంగా రూ. 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు ఇన్ సైడ్ ఇన్ఫర్మేషన్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, రామ్ ప్రస్తుతం `ద వారియర్` చిత్రం చేస్తున్నాడు. కోలీవుడ్ కెప్టెన్ లింగుస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ కాప్ డ్రామా.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి వచ్చే అవకాశముంది. ఇందులో రామ్ కి జోడీగా కృతి శెట్టి ఎంటర్టైన్ చేయనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



