
కళ్ళతోనే తన క్యారక్టర్ రూపురేఖలు మొత్తాన్ని ప్రెజెంట్ చేయగల భామ భాగ్యశ్రీ బోర్సే. నెంబర్ వన్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమనే మాటలు కూడా సినీ సర్కిల్స్ లో పరిచయం అవుతున్నాయి. లెనిన్ తో తొలి సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఖాతాలోకి భారీ ఆఫర్ వచ్చి చేరింది.
మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కనున్న భారీ చిత్రం ‘ఆపరేషన్ గంగ’లో భాగ్యశ్రీ బోర్సే ఫిక్స్ అయినట్టుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు..తొలి మలయాళ డెబ్యూనే మోహన్‌లాల్ వంటి సీనియర్ స్టార్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకోవడంతో భాగ్యశ్రీ కెరీర్‌కి మరో కీలక మలుపుగా మారనుంది.అయితే సినిమాలో ఆమె పోషించబోయే పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. దీంతో మోహన్‌లాల్‌తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకునే విధానం ఎలా ఉంటుంది? ఆమె పాత్ర కథలో ఎంత కీలకంగా ఉండబోతోంది? అనే ఆసక్తి నెలకొంది.
Also Read: థియేటర్స్ లో ఉన్నప్పడే: ఇరుముడి ఓటిటి రిలీజ్ డేట్ ఇదే!
‘ఆపరేషన్ గంగ’ కి విష్ణు మోహన్ దర్శకుడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ను ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. ‘ధురంధర్’ వంటి భారీ చిత్రానికి సంగీతం అందించిన సస్వత్ సింగ్ సచ్ దేవ్ ‘ఆపరేషన్ గంగ’కు మ్యూజిక్ అందించనున్నట్లు సమాచారం. మొత్తానికి.. ‘లెనిన్’తో సక్సెస్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సేకి మోహన్‌లాల్‌తో కలిసి నటించే ఛాన్స్ రావడం ఆమె కెరీర్ కి మంచి బూస్టప్ అని చెప్పవచ్చు.

[Bhagya Shree Borse, Mohanlal, Operation Ganga, Vishnu Mohan, Telugu Cinema, Telugu Cinema News, First Day Collections, Tollywood]






