త్రివిక్రమే కారణమని మండిపడుతున్న బండ్ల గణేష్!
on Jan 11, 2023

కమెడియన్ కం ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. వీరిద్దరి మధ్య అనుబంధం గురించి మనకు తెలియదు గాని పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ సినిమా ఈవెంట్స్ లో బండ్ల గణేష్ స్పీచ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. పవన్ దేవుడైతే నేను భక్తుడిని అని ఆయన బాహాటంగా చెప్పుకుంటారు. ఆయన నిర్మాతగా పవన్‌తో తీన్మార్, గబ్బర్ సింగ్ సినిమాలు చేశారు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
పవన్‌తో మరో సినిమా చేయాలని బండ్ల గణేష్ ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు. అయినా అది కుదరడం లేదు. పవన్ కు బండ్ల గణేష్ కు మధ్య త్రివిక్రమ్ అడ్డుగా మారాడని బండ్ల గణేష్ నమ్ముతున్నారు. తనతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేయకుండా త్రివిక్రమే అడ్డుపడుతున్నాడని బండ గణేష్ గట్టిగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. ఆ మధ్య ఓ అభిమానితో ఫోన్లో మాట్లాడుతూ త్రివిక్రమ్ పై నోరు జారారు.
బండ్ల గణేష్ అది బయటకు లీకు కావడంతో తప్పు ఒప్పేసుకున్నారు. లేటెస్ట్ గా మరో ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ మండిపడ్డారు. పవన్‌లో ఉన్న టాలెంట్ ముందుగా నేనే గుర్తించాను. అతను మామూలు వ్యక్తి కాదు అని నాకు ముందే తెలుసు.. ఆయన అందరికీ అతీతమైన వ్యక్తి. నిజమైన పవన్ కళ్యాణ్ ను బయటకు తీసింది నేనే అన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన ఇంకా మాట్లాడుతూ ఎవరో గురూజీ బారూజీ అని వచ్చారు అది నాకు తెలియదు... అని బండ గణేష్ అన్నారు. తను చెప్పిన గురూజీ కామెంట్ త్రివిక్రమ్ గురించి అని అందరికీ తెలిసిందే. మరి త్రివిక్రమ్ పై బండ్ల గణేష్ ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నాడు? అన్నది అతనికే తెలియాలి.
పవన్ తో సినిమా విషయంలో తనకి ఛాన్స్ రానివ్వకుండా చేస్తున్నాడని, తనకు పవన్ సినిమా చేయకపోవడానికి త్రివిక్రమే కారణమని... అతడిని కావాలని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు బండ గణేష్. ఎవరు ఏమనుకున్నా సరే త్రివిక్రమ్ మాత్రం బండ్ల గణేష్‌ని చాలా లైట్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా బండ్లకి విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తమ మధ్య కావాలనే గ్యాప్ సృష్టించారని నాడు ఎన్టీఆర్ సన్నిహితులపై కూడా బండ్ల మండిపడిన సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



