"నా సినిమా ప్రచారం చేస్తుంది"- బాలయ్య
on May 29, 2012
"నా సినిమా ప్రచారం చేస్తుంది" అని బాలయ్య అన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉపఎన్నికలు జరుగబోతున్నయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు విలేఖరులు యువరత్న నందమూరి బాలకృష్ణతో "మీరు మీ తెలుగు దేశం పార్టీ తరపున ప్రచారానికి వెళతారా...?" అని ప్రశ్నించారు.
దానికి సమాధానంగా బాలకృష్ణ " ముందుగా నా సినిమా "అధినాయకుడు" ని ఎన్నికల ప్రచారానికి పంపిస్తున్నాగా...! తర్వాత నేను వస్తాను....! అని అన్నారు. బాలకృష్ణ లాగే జూనియర్ యన్.టి.ఆర్ కూడా తెలుగు దేశం పార్టీ తరపున ఎన్నికల ప్రచారానికి వెళ్ళనున్నారని సమాచారం.