మొన్న తారక్... నేడు ప్రభాస్...!
on Sep 21, 2013
"యమదొంగ" చిత్రానికి ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండేవాడు. కానీ రాజమౌళి తన "యమదొంగ" చిత్రం కోసం ఎన్టీఆర్ ను సన్నగా, స్లిమ్ గా మార్చేసాడు. ఆ చిత్రం నటన పరంగా ఎన్టీఆర్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్ళింది. సినిమా కూడా విజయం సాధించింది. అయితే అప్పుడు తారక్ ను సన్నబడేలా తయారు చేసిన రాజమౌళి, ప్రస్తుతం "బాహుబలి" చిత్రం కోసం ప్రభాస్ లావుగా అవ్వాలని చెప్పాడంట. "బాహుబలి" చిత్రం కోసం 150 కేజీల బరువు ఉండాలని రాజమౌళి చెప్పడంతో... ప్రస్తుతం ప్రభాస్ ఫిట్ నెస్ ట్రైనర్స్ అధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ తన బరువును కాపాడుకుంటున్నాడు. ఈ చిత్రంలో రానా, అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుండగా రమ్యకృష్ణ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది.