ENGLISH | TELUGU  

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాది లేనట్టే!

on Apr 19, 2024

ఒకప్పుడు మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) వేగంగా సినిమాలు చేసేవాడు. కానీ కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయింది. గత ఆరేళ్లలో ఎన్టీఆర్ నటించిన సినిమాలు కేవలం రెండే విడుదలయ్యాయి. 2018లో 'అరవింద సమేత' విడుదల కాగా, నాలుగేళ్లకు 2022 లో 'ఆర్ఆర్ఆర్' విడుదలైంది. 'ఆర్ఆర్ఆర్' వచ్చి కూడా ఇప్పటికే రెండేళ్లు పూర్తయింది. తారక్ తదుపరి చిత్రం 'దేవర'(Devara) ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానుంది. 

'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించడంతో ఇక నుంచి ఎన్టీఆర్ చేసే సినిమాలన్నీ భారీగానే ఉంటాయి. భారీ సినిమాలు కాబట్టి ఆలస్యం కావడం సహజం. కానీ అసలు సినిమాలను స్టార్ట్ చేయడానికే ఎన్టీఆర్ ఎక్కువ సమయం తీసుకోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత 'దేవర' సినిమాని స్టార్ట్ చేయడానికి ఎన్టీఆర్ చాలా సమయం తీసుకున్నాడు. కానీ మరో ప్రాజెక్ట్ కూడా అలాగే ఆలస్యంగా స్టార్ట్ కానుంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఈ వేసవిలోనే ప్రారంభం కావాల్సి ఉంది. 'దేవర' షూటింగ్ ఆలస్యమవ్వడం, ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్ 2'(War 2) షూట్ ఇటీవలే స్టార్ట్ అవ్వడంతో.. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కనీసం ఈ ఏడాది ద్వితీయార్థంలో అయినా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని భావించారంతా. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడంలేదు.

ప్రశాంత్ నీల్ ముందుగా ప్రభాస్ తో 'సలార్ 2'(Salaar 2)ని చేయనున్నాడట. ఇది పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. 'సలార్ 2' పూర్తయ్యాక.. 2025 ద్వితీయార్థంలో ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ మొదలు కానుందని అంటున్నారు. ఇదే ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ కి నిరాశ కలిగిస్తోంది.

నిజానికి 'దేవర' రెండు భాగాలుగా రానుంది. ముందుగా 'దేవర-1', 'వార్ 2' పూర్తి చేసి, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని కూడా పూర్తి చేసి.. అప్పుడు 'దేవర-2'ని స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ భావించాడు. కానీ ఇప్పుడు నీల్ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండటంతో.. 'వార్ 2' తరువాత  'దేవర-2'ని స్టార్ట్ చేస్తాడా? లేక మరేదైనా ప్రాజెక్ట్ ని లైన్ లో పెడతాడా? చూడాలి. ఎందుకంటే ఈ ఏడాది చివరి నాటికి  'దేవర-1', 'వార్ 2' పూర్తయ్యి.. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో నీల్ ప్రాజెక్ట్ మొదలయ్యే వరకు ఎన్టీఆర్ ఖాళీగా ఉండాల్సి వస్తుంది. మరి ఈ గ్యాప్ లో ఏం చేస్తాడో చూడాలి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.