అత్తారింటి..పై కన్నేసిన తమిళ తంబీలు
on Oct 4, 2013
పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ రికార్డును సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రంపై తమిళ తంబీలు కన్నేశారు. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు కోలీవుడ్ నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రం రీమేక్ పై తమిళ నటుడు విజయ్ కూడా ఆసక్తి చూపుతున్నాడు. గతంలో చాలా తెలుగు హిట్ చిత్రాలను తమిళంలో విజయ్ రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. మరి ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం చాలా మంది భారీ మొత్తంలో చెల్లించి, రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లుగా తెలిసింది.మరి ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.