పవన్ రికార్డుల మోత
on Oct 22, 2013
పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" సినిమా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే అన్నీ రికార్డులను బ్రేక్ చేస్తూ "అత్తారింటికి దారేది" సినిమా అరుదైన ఘనత సాధించింది. టాలీవుడ్ సినీ చరిత్రలో ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన "మగధీర" చిత్రం అత్యధిక కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టిస్తే... ఇప్పుడు ఆ రికార్డును రికార్డును పవన్ "అత్తారింటికి దారేది" సినిమా అధిగమించి రికార్డులను తిరగరాసింది. పవన్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం సోమవారం నాటికీ 73.2 కోట్లు వసూలు చేసి, కలెక్షన్ల పరంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.ఈ చిత్రం విడుదలైన 25 రోజులకే "మగధీర" రికార్డును అధిగమించిందంటే... 50రోజుల వరకు ఇంకెన్ని కలెక్షన్లను రాబట్టి, ఎన్ని రికార్డుల మోత మోగించనుందో చూడాల్సి ఉంది. పవన్ అభిమానులకు ఈ చిత్రం ఈ సంవత్సరానికే ఒక పెద్ద పండగలా అయ్యింది.