గబ్బర్ సింగ్ 2లో అన్నవరం భామ?
on Dec 20, 2013
"అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ ఆసిన్. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడు టాలీవుడ్ లో అగ్ర, యువ హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ లో అవకాశం రావడంతో టాలీవుడ్ ను వదిలేసిన ఈ అమ్మడికి ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సరైన అవకాశాలు రావట్లేదు. దాంతో మళ్ళీ ఈ అమ్మడి కన్ను టాలీవుడ్ పై పడింది.
పవన్ కళ్యాణ్ తో "అన్నవరం" చిత్రంలో నటించింది. కానీ ఆ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే ప్రస్తుతం పవన్ నటించే "గబ్బర్ సింగ్ 2" సినిమాలో హీరోయిన్ గా నటించమని ఆసిన్ ను సంప్రదించారట. ఈ విషయాన్ని స్వయంగా ఆసిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. అయితే ఆసిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే విషయం చెప్పలేదు. కానీ ఈ విషయం విన్నవాల్లందరూ కూడా ఆసిన్ తప్పకుండా ఒప్పుకుంటుంది అని అంటున్నారు. ఎందుకంటే పవన్ తో నటించే చాన్స్ అందరికి రాదు. అసలే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి చాలా మంది హీరోయిన్లు క్యూ లో ఉన్నారు. కానీ ఈ అవకాశం ఆసిన్ కు రావడం లక్కీ ఛాన్స్ అని అంటున్నారు. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.