Home

»

Latest News

పనిమనిషి లైంగిక వేధింపులు.. రెండో ఫ్లోర్ నుంచి కిందకి దూకేసిన ప్రముఖ నటి 

May 6, 2026 3:57PM

జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట అన్నాడు ఒక మహాకవి. ఆ మహాకవి రాసింది పదాలు కాదని, జీవిత సత్యమనే విషయం ప్రముఖ నటి ఆర్తీ సింగ్( Arti Singh)చెప్పిన మాటల ద్వారా మరోసారి  అర్ధమవుతుంది. నిత్యం చిరునవ్వుతో కనిపిస్తూ, ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తపరిచే ఆర్తీ వెనుక ఇంతటి విషాదకరమైన గతం ఉందన్న విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్.
 
రీసెంట్ గా ఆర్తీ సింగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నాకు 13 ఏళ్ల వయసప్పుడు ఇంట్లో ఎవరూ లేని తరుణంలో పని మనిషి నాపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. నువ్వు నా అన్నయ్యవి  కదా అని వేడుకున్నాను. అయినా సరే  గది తలుపులు వేసి నన్ను బంధించడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ దుర్మార్గుడి నుంచి  తప్పించుకోవడానికి రెండో అంతస్థుకి పరుగెత్తి కిందకి  దూకేసాను. అదృష్టవశాత్తూ ఆ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది కానీ తీవ్రమైన గాయాలయ్యాయి. ఆ సమయంలో నాకు కేవలం నా ఆత్మగౌరవం, రక్షణ మాత్రమే గుర్తొచ్చాయి. కిందకు దూకితే ఏమవుతుందో అన్న భయం కంటే, ఆ వ్యక్తి చేతిలో చిక్కుకుంటే ఏం జరుగుతుందో అన్న భయం ఎక్కువగా ఉండటంతో దూకేశానని ఆర్తి చెప్పుకొచ్చింది.

also read: Tollywood trending: టాలీవుడ్ ట్రేండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్ చూద్దాం 


ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో  నెటిజన్లు స్పందిస్తు  బాల్యంలో ఎదురైన అలాంటి  చేదు అనుభవాలని బయటకి చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలి ఆర్తి మాటలు మరెంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తాయనే  కామెంట్స్ చేస్తున్నారు.  'తోడా హై బాస్ థోడేకి జరూరత్ హై', 'పరిచయ్', వారిస్‌ వంటి హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపుని అందుకున్న ఆర్తి  2019లో, బిగ్ బాస్ 13లో కంటెస్టెంట్‌గా పాల్గొని 4వ రన్నరప్‌గా నిలిచింది.  ఒకప్పటి బాలీవుడ్ అగ్ర హీరో గోవిందా మేనకోడలే ఆర్తీ.  2024  ఏప్రిల్ లో దీపక్ చౌహాన్‌ అనే బిజినెస్ మెన్ ని  వివాహం చేసుకుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com