Home

»

Latest News

Arjun das: అర్జున్ దాస్ ఎమోషనల్ బ్రేక్ అప్ పోస్ట్.. ఆ హీరోయిన్ నేనా!

Mar 13, 2026

 

-ఎందుకు ఆ విధంగా పోస్ట్ చేసాడు
-బ్రేక్ అప్ ఎందుకు అయ్యింది 
-ఇంతకీ ఆమె ఎవరు

అర్జున్ దాస్(Arjun Das).. సౌత్ సినీ ఇండస్ట్రీకి దొరికిన మరో వర్ స్టైల్ యాక్టర్. ఎవరైనా నెగిటివ్ రోల్ లో చేస్తుంటే తిట్టుకుంటూ ఉంటాం. కానీ అర్జున్ దాస్ నెగిటివ్ రోల్ లో పెర్ఫార్మ్ చేస్తే మైమరచిపోయి చూస్తుంటాం. పైగా వాయిస్ అతి పెద్ద ఎసెట్. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)సైతం  లెజండ్రీ యాక్టర్ 'రఘువరన్'(Raghuvaran)తో కంపార్ చేసాడంటే అర్జున్ దాస్ కెపాసిటీని అర్ధం చేసుకోవచ్చు. రీసెంట్ గా అర్జున్ దాస్ ఒక పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ హోదాలో సోషల్ మీడియాకి ప్రత్యేక గుర్తింపుని తెస్తుంది. ఆ పోస్ట్ ఏంటో చూద్దాం 

అర్జున్ దాస్  తన ఇన్ స్టా స్టోరీలో 'మీరు ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే, వారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతారు. అసలు ఒక మనిషి ఇంత సులభంగా ఎలా మూవ్ ఆన్ అవుతారు? అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన ఎవరికైనా బ్రేక్ అప్ పోస్ట్ అనే విషయం అర్ధమవుతుంది. ఆ వర్డ్స్ కి ఉన్న కెపాసిటీ అది. కాకపోతే ప్రేమ అనే వర్డ్ పై హక్కు  ప్రియుడు, ప్రియురాలికే కాదు అన్ని రిలేషన్స్ కి వర్తిస్తుంది. కాబట్టి ఆ పోస్ట్ ప్రేమలో  విఫలమవడం వల్ల చేశాడా లేక మరో విషయంలోనా అని తేలాల్సి ఉంది. అర్జున్ దాస్ తన ఇనిస్టాలో కొత్త సినిమాల అప్ డేట్స్ ని ఎప్పటికప్పుడు పంచుకుంటు ఉంటాడు. అలాంటిది ఫస్ట్ టైం లవ్ గురించి చెప్పాడు. 

also read:  Ustaad Bhagat sing: గెలిచిన ఉస్తాద్ భగత్ సింగ్.. సాక్ష్యంగా నిలిచిన సుప్రీంకోర్టు

అభిమానులు, నెటిజన్స్ కూడా పైన చెప్పుకున్న డౌట్స్ ని వ్యక్తం చేస్తూనే కొత్త సినిమాలోని    డైలాగ్ ఏమో అనే కామెంట్స్  చేస్తున్నారు. అర్జున్ దాస్ లిస్ట్ లో అయితే ఎలాంటి కొత్త చిత్రం లేదు. గత ఏడాది ఓజితో పాటు తమిళ మూవీ కుంకీ పార్ట్ 2 లో చేసాడు. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో క్లోజ్ గా దిగిన ఫొటోలు మాత్రం వైరల్ గా నిలిచాయి. ఆ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారనే రూమర్స్ కూడా వచ్చాయి. దీంతో ఆమెతోనే బ్రేక్ అప్ చెప్పాడా అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com