TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

హాట్‌ న్యూస్‌: పవన్‌తో అనుష్క!

May 4, 2020 4:22PM

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో వేడి వేడి వార్త ఏంటంటే... పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో రాబిన్‌హుడ్‌ కాన్సెప్ట్‌తో హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా తెరకెక్కుతోంది కదా! అందులో కథానాయికగా అనుష్క శెట్టిని తీసుకున్నారట!! ఇంతకు ముందు ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్‌ భామ జాక్వలైన్‌ ఫెర్నాండేజ్‌తో పాటు మరికొందరి పేర్లు వినిపించాయి. ఆల్రెడీ రెండుమూడుసార్లు హైదరాబాద్‌ వచ్చిన జాక్వలైన్‌, దర్శకుడు క్రిష్‌ను కలిసింది కూడా! 40 రోజుల్లో హీరోయిన్‌ మీద తీయవలసిన సన్నివేశాలు పూర్తి చేసేలా ప్లాన్‌ చేశారు. ఆమెతో పాటు సినిమాలో మరో హీరోయిన్‌ ఉంటుందా? లేదంటే జాక్వలైన్‌ బదులు అనుష్కను తీసుకుంటున్నారా? అనే విషయం తెయాల్సి ఉంది. పవన్‌తో అనుష్క నటించడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.

చిరంజీవితో ‘స్టాలిన్‌’లో స్పెషల్‌ సాంగులో డ్యాన్స్‌ చేసిన అనుష్క, ‘సైరా నరసింహరెడ్డి’లో అతిథి పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయిలా కనిపించారు. అంతకు ముందు అల్లు అర్జున్‌తో ‘వేదం’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో కలిసి నటించారు. కథానాయికగా పదిహేనేళ్ల కెరీర్‌లో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్‌ సహా యువ హీరోలు మహేష్‌, ప్రభాస్‌, రవితేజ, గోపీచంద్‌, మంచు విష్ణుతోనూ అనుష్క నటించారు. అయితే... మెగా ఫ్యామిలీ హీరోల్లో ఇప్పటివరకూ ఎవరి సరసన కథానాయికగా నటించలేదు. ఇప్పుడు పవన్‌తో సినిమా కుదిరింది.

google-ad-img