ఇదే నెలలో రానున్న సుమంత్
on Aug 3, 2013
సుమంత్ అశ్విన్, ఈషా జంటగా నటిస్తున్న చిత్రం "అంతకు ముందు.. ఆ తరువాత". మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ నిర్మిస్తున్నారు.
షూటింగ్ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... "యువతరం యొక్క ప్రేమని వెండితెరపై సరికొత్తగా చూపించబోతున్నాం. ప్రేమ, భావోద్వేగం వంటి అంశాలతో కూడిన ఒక చక్కని కుటుంబ కథా చిత్రం ఇది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో నచ్చుతుందని" అన్నారు.