ట్రెడిషనల్ లుక్ లో అనసూయ.. ఇంట్లో ప్రత్యేక పూజలు
on Nov 30, 2022
అనసూయ బుల్లితెర మీద ఎంతో ఫేమస్ పర్సన్. సోషల్ మీడియాలో ఏదో ఒక హాట్ టాకిప్ తో ఆమె ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. తనకు ఏ విషయం కరెక్ట్ కాదు అనిపిస్తే చాలు వెంటనే సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తుంది..అంత బోల్డ్ అనసూయ రీసెంట్ గా ట్రెడిషనల్ గెటప్ లో కనిపించి అలరించింది. అనసూయ తన భర్త భరద్వాజ్ తో కలిసి ప్రత్యేక పూజలు చేస్తున్న ఓ వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది. అనసూయ కుటుంబ సభ్యులు అంతా కూడా ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. వేద పండితులు మంత్రాలు చదువుతుంటే అనసూయ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం తిరునామాలు పెట్టుకుని పూజలు చేశారు.
అసలు అనసూయ ఈ పూజలు ఎందుకు జరిపించిందో అనే క్లారిటీని తన ఫ్యాన్స్ కి ఇవ్వలేదు. ఈ వీడియోకి కేవలం ‘సర్వేజనా సుఖినోభవంతు’ అని టాగ్ లైన్ పెట్టి పోస్ట్ చేసింది. ఇక అనసూయను ఇలా ఈ ట్రెడిషనల్ లుక్ లో చూసేసరికి "మీరంతా బాగుండాలి.. ఈ లుక్ లో మీరు చాలా బాగున్నారు.. ఇలాగే తిరునామాలు పెట్టుకుని ఒక మూవీ చేయండి మేడం" అంటూ నెటిజన్స్, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.