అనగనగా మూవీ రివ్యూ
on May 15, 2025
మూవీ : అనగనగా
నటీనటులు: సుమంత్, కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్, అను హసన్, రాకేశ్ రాచకొండ, బి.వి.ఎస్ రవి, కౌముది నెమని తదితరులు
ఎడిటింగ్: వెంకటేష్ చందురు
మ్యూజిక్: చందు రవి
సినిమాటోగ్రఫీ: పవన్ పప్పుల
నిర్మాతలు: రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్ర మదిరెడ్డి
రచన, దర్శకత్వం: సన్నీ సంజయ్
ఓటీటీ: ఈటీవీ విన్
కథ:
ఇద్దరు తల్లిదండ్రులు ఒక పిల్లాడిని సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ ఆ పిల్లాడు.. స్కూల్ వెళ్ళను..చనిపోవాలనుంది అంటు చెప్తుంటాడు. అది విన్న డాక్టర్ పిల్లాడికి కావల్సింది వైద్యం కాదని చెప్తూ వ్యాస్ లివింగ్ స్కూల్ కి తీసుకెళ్తాడు. అక్కడ విద్యని చెప్పే పద్దతి చూసి ఆ పిల్లాడు అట్రాక్ట్ అవుతాడు. దాంతో వ్యాస్ సర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. వ్యాస్(సుమంత్) ఒక కార్పొరేట్ స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్‌గా పని చేస్తుంటాడు. బట్టీ చదువులు వద్దంటూ కథల రూపంలో కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలని చెప్తుంటాడు. అయితే అదే స్కూల్లో తన భార్య భాగ్య(కాజల్ చౌదరీ) ప్రిన్సిపల్‌గా పని చేస్తుంది. ఆమె మేనేజ్మెంట్ చెప్పింది చేయాల్సి వస్తుంది. వ్యాస్‌కి, ఆయన భార్య భాగ్యకి మధ్య ఈ విషయంలో గొడవలు అవుతుంటాయి. ఈ క్రమంలో వ్యాస్ ఉద్యోగం మానేస్తాడు. ఆ తర్వాత తన కొడుకు రామ్ చెప్పిన సలహా ప్రకారం సాయంత్రం ట్యూషన్ ని స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత వ్యాస్ కి ఎదురైన సవాళ్లేంటి? తాను అనుకున్నది సాధించాడా? అసలు వ్యాస్ లివింగ్ స్కూల్ ఎలా మొదలైందనేది మిగతా కథ.
విశ్లేషణ:
ఇది సినిమా కాదు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కథ. ప్రతీ ప్రైవేట్ స్కూల్లో నిత్యం మార్కుల కోసం ర్యాంకుల కోసం పిల్లలపై చేసే ఒత్తిడికి చాలా మంది చనిపోతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేద్దామనే ప్రెష్ పాయింట్ తో సన్నీ సంజయ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. మరి ఇందులో అతను సక్సెస్ అయ్యాడా అంటే అవుననే చెప్పాలి. బట్టీ మార్కుల ఫలితాలకి దూరంగా కథల రూపంలో, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చదువుని ప్రతీ విద్యార్థికి అందిద్దామని అనుకునే వ్యాస్ పాత్రతో ప్రతీ ఒక్కరు కనెక్ట్ అవుతారు.
ఓ విద్యార్థి సూసైడ్ చేసుకోవాలనుకోవడం చూసిన వ్యాస్ అతడిని ఎలాగైనా పాస్ చేపించాలనే ఉద్దేశ్యంతో ట్యూషన్ స్టార్ట్ చేయడం ఆకట్టుకుంటుంది. విద్యార్థులు ప్రెజర్ ఫీల్ కావడం, అటు టీచర్స్ పెట్టే ప్రెజర్, ఇటు పేరెంట్స్ ప్రెజర్‌కి వాళ్లు ఎలా స్ట్రగుల్ అవుతున్నారనేది కళ్లకి కట్టినట్టు చూపించారు. ఆయా సన్నివేశాలు రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటాయి.
ఫస్టాఫ్ అంతా చూసి ఫ్రెష్ కాన్సెప్ట్ అనిపిస్తుంది కానీ సెకెంఢాఫ్ లో వ్యాస్ బాల్యం, రామ్ తో జరిగే సన్నివేశాలు ఉంటాయి. కథల రూపంలో పాఠాలు చెప్పాలని, ప్రత్యామ్నాయ విద్యావ్యవస్థని తీసుకురావాలని వ్యాస్ పాత్ర పడే బాధ, ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ని చూపించారు. ఈ ఆటుపోట్లు, బాధలు వంటి సీన్లు కాస్త సాగదీసినట్టుగా ఉంటాయి.
సినిమాలో ఎక్కడ అడల్డ్ సీన్లు లేకుండా, బూతులు లేకుండా జాగ్రత్తగా నీట్ గా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. ఇంకా క్లైమాక్స్ లో రామ్, వ్యాస్ ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ చూసి ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. నాన్న, కొడుకు బాండింగ్ ని చక్కగా చూపించాడు దర్శకుడు. పవన్ పప్పుల సినిమాటోగ్రఫీ బాగుంది. వెంకటేష్ చందు ఎడిటింగ్ నీట్ గా ఉంది. సెకెంఢాఫ్ లో ఓ పది నిమిషాలు ట్రిమ్ చేస్తే నెక్ట్ లెవెల్ ఉండేది. చందు రవి మ్యూజిక్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
వ్యాస్ గా సుమంత్, భాగ్యగా కాజల్ చౌదరి, రామ్ గా మాస్టర్ విహార్ష్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా ఇది. ప్రతీ స్టూడెంట్, టీచర్స్, పేరెంట్స్ మస్ట్ వాచ్.
రేటింగ్: 2.75 / 5
✍️. దాసరి మల్లేష్

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
