TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

అమెజాన్‌లోకి అమితాబ్ గులాబో...

May 14, 2020 9:10PM

స్టార్ హీరోలు నటించిన సినిమా అయితేనేమి? ఛోటా మోటా ఆర్టిస్టులు నటించిన సినిమాలు అయితేనేమి? రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాలను తమ దగ్గర దాచిపెట్టుకొని, థియేటర్లు ఓపెన్ అయ్యేవరకు వెయిట్ చేయడం ఎందుకని నిర్మాతలు భావిస్తున్నట్టు ఉన్నారు. ఓటీటీ ఫ్లాత్‌ఫార్మ్స్ వైపు చూస్తున్నారు. మంచి రేటు వస్తే అమ్ముతున్నారు. 

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన 'కాంచన' రీమేక్ 'లక్ష్మి బాంబ్' హాట్ స్టార్-డిస్నీ ఓటీటీలో విడుదల అవుతుందని సమాచారం. అయితే ఇంకా అధికారికంగా చెప్పలేదు. అక్షయ్ సినిమా సంగతి ఏమో గానీ అమితాబ్ బచ్చన్ నటించిన 'గులాబీలో సితాబో' సినిమా మాత్రం ఓటీటీలోకి రావడానికి రంగం సిద్ధమైంది.  అమెజాన్‌లోకి ఈ సినిమా జూన్ 12న రిలీజ్ కానుంది. జస్ట్ అమితాబ్ నటించిన సినిమా మాత్రమే కాదిది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా కూడా ఉన్నాడు. డైరెక్టర్ కూడా ఛోటా మోటా మనిషి కాదు. హిందీలో మంచి పేరున్న సుజిత్ సర్కార్. ఈ సినిమా ఓటీటీకి వస్తుండడంతో ఇదే బాటలో మరిన్ని సినిమాలు క్యూ కడతాయని ఆశించవచ్చు.

google-ad-img