TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

అమరన్ కి 200 కోట్ల కలెక్షన్స్!

Nov 4, 2024 1:51PM

శివ కార్తికేయన్ (sivakarthikeyan), సాయిపల్లవి (sai pallavi) జంటగా దివాలి కానుకగా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా విడుదలైన మూవీ అమరన్. దివంగత మేజర్ ముకుందన్ వరదరాజన్ (major mukund varadarajan) జీవిత కథ ఆదారంగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుపోతుంది. కలెక్షన్స్ పరంగా కూడా ఎన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకుంటుంది.

వీకెండ్ లోపే వంద కోట్లకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ మూవీ, లాంగ్ రన్‌లో  రెండు వందల కోట్ల మార్క్ ని అందుకునే అవకాశముంది. పైగా  ఓవర్సీస్‌లో ఈ చిత్రం ద్వారా  శివ కార్తికేయన్ రేర్ ఫీట్ అందుకున్నాడు. ఇంత వరకు తన కెరీర్‌ లో  మిలియన్ డాలర్ క్లబ్బులోకి జాయిన్ అయిన మూవీ లేదు. కానీ అమరన్ ఈ ఫీట్‌ను కేవలం నాలుగైదు రోజుల్లోనే సాధించేసింది. దీంతో  శివ కార్తికేయన్ యు ఎస్ మార్కెట్ ఇప్పుడు అమాంతం పెరిగిందని చెప్పవచ్చు.

అగ్ర హీరో కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియ స్వామి(raj kumar periyaswamy) దర్శకత్వం వహించగా భువన్ అరోరా, రాహుల్ బోస్, శ్యాం మోహన్, సురేష్ చక్రవర్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. జి వీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించాడు. సాయి ఫోటోగ్రాఫ్ ని అందించాడు.


 

google-ad-img