
తాజాగా ఫోర్బ్స్ ఇండియా ఆగస్టు మ్యాగజైన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెరిశారు. అయితే, ఆ ఆర్టికల్ లో అల్లు అర్జున్‌ని ‘రెబల్ స్టార్’ అని సంబోధించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఒక్క పదంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది.
పెదనాన్న కృష్ణంరాజు నుండి వారసత్వంగా ‘రెబల్ స్టార్’ ట్యాగ్ ప్రభాస్ కి వచ్చింది. నేషనల్ వైడ్ గా అదే ట్యాగ్ తో ఆయన పాపులర్. అలాంటిది ఇప్పుడు ఆ ట్యాగ్ ను ఫోర్బ్స్ లాంటి అంతర్జాతీయ మ్యాగజైన్ టీమ్.. అల్లు అర్జున్‌కి ఆపాదించడం సంచలనంగా మారింది.
ఇది ఫోర్బ్స్ ఇండియా ఎడిటోరియల్ టీమ్ చేసిన మిస్టేక్ అయి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీ హీరోల ట్యాగ్స్‌పై పూర్తి అవగాహన ఉండకపోవచ్చు అంటున్నారు. మరోవైపు, పుష్ప 2తో అల్లు అర్జున్ సృష్టించిన ప్రభంజనాన్ని చూసి, డిస్క్రిప్టివ్‌గా ‘రెబెల్ స్టార్’ అని రాసి ఉంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ఏది ఏమైనా అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అని కాకుండా.. ‘రెబల్ స్టార్’ ట్యాగ్ తో సంబోధించడం వివాదానికి దారి తీసింది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. "రెబల్ స్టార్ అనేది ప్రభాస్ కి మాత్రమే సొంతం. ఫోర్బ్స్ వెంటనే తప్పు సరి దిద్దుకోవాలి" అని డిమాండ్ చేస్తున్నారు.
ఈ కాంట్రవర్సీపై ఇప్పటివరకు ఫోర్బ్స్ ఇండియా కానీ, లేదా అల్లు అర్జున్ టీమ్ కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించి, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.
[Forbes India, Allu Arjun, Rebel Star, Controversy, Prabhas, Telugu Film News, Telugu News, Tollywood]





