TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

మళ్ళీ రేసుగుర్రం వాయిదా

Mar 24, 2014 3:00PM

 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న "రేసుగుర్రం" చిత్ర విడుదలను మరోసారి వాయిదా వేసారు. మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆరోజు బాలయ్య నటించిన "లెజెండ్" సినిమా విడుదలవుతుండటంతో ఏప్రిల్ 4వ తేదికి వాయిదా వేసారు. అయితే ఇపుడు ఏప్రిల్ 11వ తేదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఏమో. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తుంది. శృతిహాసన్, సలోని కథానాయికలు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్లో నల్లమలుపు బుజ్జి, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

google-ad-img