TeluguOne App Promotion
● # Tweets

Home

»

తాజా

బాస్ 25 వ సినిమా: ఆ దర్శకుడు ఖాయమయ్యాడా: ఫ్యాన్స్ అసలు విజిల్స్ ఆపద్దు! 

Nov 26, 2026 1:42PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  ఇరవై ఐదవ సినిమా ఎలా ఉండబోతుంది? టైటిల్ ఎలా ఉంటుంది? దర్శకుడు ఎవరు? అనే చర్చ ఇప్పుడు  అభిమానుల మధ్య జరుగుతుంది. నిజానికి ఇరవై ఐదవ సినిమాకి ఇంకా మూడు సినిమాల గ్యాప్ ఉన్నా కూడా అభిమానులు నిష్కల్మషం లేని ఆశాజీవులు కాబట్టి ఇప్పట్నుంచే చర్చ మొదలు పెట్టారు. మరి సోషల్ మీడియా కూడా తన వంతు బాధ్యతగా ఇరవై ఐదవ సినిమా గురించి ఏం చెప్తుందో చూద్దాం.

రాకా’ అల్లు అర్జున్ ఇరవై రెండవ మూవీ. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ తో చేస్తున్నాడు. అంటే ఇరవై మూడవ మూవీ. ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. మరోవైపు ‘సరైనోడు’తో అల్లు అర్జున్ కి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన బోయపాటి శ్రీనుతో మరోసారి సినిమా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బోయపాటి చెప్పిన కథను అల్లు అర్జున్ విన్నారని, కథ నచ్చడంతో ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఖాయమైతే ఇరవై నాలగవ మూవీ. 


మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు కూడా అల్లు అర్జున్ తదుపరి సినిమాల జాబితాలో వినిపిస్తోంది. గతంలోనూ బన్నీతో సినిమా చేసే అవకాశాలపై బాసిల్ పలు సందర్భాల్లో ఆసక్తికరమైన సంకేతాలు ఇచ్చారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే వచ్చే ఏడాది తన దర్శకత్వంలో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. మరోవైపు  ఒక బాలీవుడ్ అగ్ర దర్శకుడితో అల్లు అర్జున్ తన ఇరవై ఐదవ సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఎందుకంటే ఇరవై ఐదవ సినిమా అనేది ఎంతో ప్రతిష్టాత్మక మూవీ. బాలీవుడ్ లోను భారీ అంచనాలు ఉంటాయి. అందుకే బాలీవుడ్ బడా దర్శకుడితో సినిమా ఉంటుందని అల్లు అర్జున్ ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ ఫాన్స్ లో జోష్ తీసుకొస్తుంది.

 

google-ad-img