మంచు విష్ణు కన్నప్ప @ 6 కోట్లు..బయటపడ్డ నిజం
on May 6, 2024
మంచు విష్ణు చారిత్రాత్మక మూవీ కన్నప్ప మీద అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.పరమేశ్వరుడి కి భక్తితో తన రెండు కళ్ళని సమర్పించిన భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఆ చిత్రం తెరకెక్కుతుంది. మొట్టమొదటి సారిగా విష్ణు పాన్ ఇండియా హీరోగా కూడా మారబోతున్నాడు.పైగా తన కెరీర్ లోనే ఫస్ట్ హై బడ్జట్ మూవీ కూడా. తాజాగా ఒక ఆర్టిస్ట్ కి సంబంధించిన రెమ్యునరేషన్ న్యూస్ కన్నప్ప రేంజ్ ని చెప్తుంది
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కన్నప్ప లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వార్త చాలా సార్లు సోషల్ మీడియాలో వచ్చింది.పైగా విష్ణు ముంబై వెళ్లి అక్షయ్ కుమార్ ని కలిసాడు కూడా. ఇక తాజా వార్తల ప్రకారం అక్షయ్ కుమార్ కన్నప్పలో శివుడిగా కనిపించబోతున్నాడనే టాక్ వస్తుంది. ఈ మేరకు తన పాత్రకు సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యిందని అంటున్నారు. ఇందుకు గాను అక్షయ్ అక్షరాలా ఆరు కోట్లు రూపాయిల రెమ్యునరేషన్ ని అందుకున్నట్లు తెలుస్తుంది.ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హైలెట్ గా నిలిచింది. గతంలో శివుడి క్యారక్టర్ ని ప్రభాస్ పోషిస్తాడనే వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో అక్షయ్ న్యూస్ ప్రాధాన్యతని కూడా సంతరించుకుంది.
కానీ ప్రభాస్ మాత్రం ఖచ్చితంగా సినిమాలో ఉన్నాడని యూనిట్ చెప్తుంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఆదివాసీ తెగకు సంబంధించిన పాత్రలో మెరవనున్నాడు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. విష్ణు,మోహన్ బాబు తమ సొంత బ్యానర్లో కన్నప్ప ని నిర్మిస్తుండగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రీతి ముకుందన్ కథానాయిక