అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్..!
on Jan 20, 2025

అక్కినేని ఇంట వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య డిసెంబర్ 4న శోభితా ధూళిపాళ్లను పెళ్లాడిన సంగతి తెలిసిందే. త్వరలో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. (Akhil Akkineni Wedding)
గతేడాది నవంబర్ లో జైనాబ్ రావడ్జీతో అఖిల్ ఎంగేజ్ మెంట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి పెళ్ళికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 24న అఖిల్-జైనాబ్ వివాహం జరగనుందని సమాచారం. ఈ వేడుకకు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



