అఖండ హైందవం.. ప్రేక్షకుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది
on Dec 2, 2025
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూసేందుకు మరో రెండు రోజులు ఆగక తప్పదు. డిసెంబర్ 4 రాత్రి 9.30గంటలకు ప్రీమియర్స్‌తో అఖండ తాండవం మొదలు కాబోతోంది. ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలు.. సినిమాకి మరింత హైప్ తీసుకొచ్చాయి. 'అఖండ2'కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ వచ్చినా వాళ్ళు, వీళ్లు అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా విడుదలైన 'అఖండ హైందవం' సాంగ్ సినిమాకి మరింత డివోషనల్ టచ్ ఇచ్చింది. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా చూసెయ్యాలన్నంత ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించారు మేకర్స్.
తాజాగా ఈ సినిమాలోని 'అఖండ హైందవం..' అంటూ సాగే పాటను విడుదల చేశారు. లిరికల్ వీడియోగా విడుదలైన ఈ పాటను సర్వేపల్లి సిస్టర్స్ ఆలపించారు. ఈ పాట మొదలైన దగ్గర నుంచి చివరి వరకు లిరిక్స్‌గానీ, మ్యూజిక్‌గానీ, పాటలోని విజువల్స్‌గానీ గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయి. సినిమాలోని పాటలన్నీ శివతత్వంతో నిండిపోయి ఉండడంతో 'అఖండ2' ప్రేక్షకుల్ని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లి.. వారికి ఒక మధురానుభూతిని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
నాగ గురునాథశర్మ లిరిక్స్ అందించిన 'అఖండ హైందవం' సాంగ్‌ను సర్వేపల్లి సిస్టర్స్ ఎంతో అద్భుతంగా ఆలపించారు. ఈ లిరికల్ వీడియోను వారిపైనే చిత్రీకరించడం విశేషం. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, థమన్.. ఈ ముగ్గురికీ 'అఖండ2' ఒక మైల్‌స్టోన్‌లాంటి సినిమా అవుతుందని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి థమన్ పెట్టిన ఎఫర్ట్ మామూలుగా లేదని సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజా' చిత్రం విడుదలైంది. ఈ సినిమాకి తమన్ చేసిన మ్యూజిక్‌కి, ఈ ఏడాది చివరలో వస్తున్న 'అఖండ2' సంగీతానికి చాలా డిఫరెన్స్ ఉంది. పాటల విషయంలోగానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో గానీ ఎంతో కేర్ తీసుకున్న థమన్‌కి అతని కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఆల్బమ్ అవుతుంది. సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. డిసెంబర్ 4న ప్రీమియర్స్‌తో ప్రారంభమయ్యే 'అఖండ2' డిసెంబర్ 5న పాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



