Home

»

Latest News

అజయ్ దేవ్‌గణ్ కి షాక్.. ఆ అక్రమ నిర్మాణాలు కూల్చివేత!

Oct 17, 2026 4:19PM

 

యాక్షన్ కింగ్ అజయ్ దేవ్‌గణ్  తన కట్ అవుట్ కి ఉన్న రేంజ్ ని మరోసారి దృశ్యం పార్ట్ 3 తో మరో సారి నిరూపించాడు. కేవలం 15 రోజులకే 520 కోట్ల గ్రాస్ వరకు వసూలు చేసాడంటే సునామి అని కూడా చెప్పుకోవచ్చు. 

 అజయ్ దేవ్‌గన్ కుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక ఆస్తి వివాదంలో చిక్కుకుంది. ముంబైలోని పాపులర్ ప్రాంతమైన జూహులో ఉన్న  బంగ్లాలో అనధికారిక నిర్మాణాల (illegal construction) పేరిట ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు ఉక్కుపాదం మోపారు. ముంబైలోని కే-వెస్ట్ (K/West) వార్డ్ పరిధిలోని కాపోల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న ఈ ప్రాపర్టీలో అనుమతులు లేకుండా చేపట్టిన మార్పులు, చేర్పులపై అధికారులు సీరియస్ అయ్యారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఇంటీరియర్ మార్పులు, విభజన గోడలు (partition walls) మరియు కిటికీల మార్పులు చేస్తున్నారనే ఆరోపణలతో ఈ భారీ కూల్చివేత చర్యలు చోటుచేసుకున్నాయి.   


ఇది కూడా చదవండి: నిన్న వెబ్ సిరీస్ రిలీజ్: ఈ రోజు ఆ వెబ్ సిరీస్ తెరకెక్కించిన దర్శకుడు మృతి!

 

 

ఈ వివాదానికి సంబంధించి గత సెప్టెంబర్ 10, 2026వ తేదీన బీఎంసీ అధికారులు తొలుత స్టాప్ వర్క్ నోటీసు జారీ చేశారు. నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేసి, తగిన అనుమతి పత్రాలను సమర్పించాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా సరే పనులు కొనసాగిస్తుండటంతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. 

 

[Ajay Devgn Juhu Bungalow Demolition, Ajay Devgn bungalow, BMC demolition, Juhu property dispute, Bollywood news, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com